Site icon vidhaatha

చిన శేషవాహనం, హంస వాహలపై ఊరేగిన శ్రీనివాసుడు

విధాత : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రెండో రోజున స్వామివారు ఉదయం చిన శేషవాహనంపై బద్రీ నారాయణుడి అలంకార సేవలో విహారించారు. రాత్రి వీణాధారి అలంకార సేవలో వెంకటేశ్వరుడు తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతిక. పాలను నీళ్లను వేరు చేసే గుణం హంస లక్షణం.

ఆత్మ, అనాత్మల వివేకాలను సూచిస్తూ, జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తిని కల్గించేందుకు స్వామివారు హంస వాహనంపై విహారించారని పురాణ కథనం. బ్రహ్మోత్సవాల్లో మంగళవారం ఉదయం సింహవాహన సేవ, రాత్రి ముత్యపు పందరి సేవలు నిర్వహించనున్నారు.

Exit mobile version