టీటీడీలో ఇకపై సిఫారసు లేఖలు స్వీకరించరా? బోర్డు ఏమంటున్నది?

ఎన్నికల కోడ్ నేపథ్యంలో గ‌తంలో వ‌లె తిరుమ‌ల‌లో వ‌స‌తి, శ్రీవారి దర్శనానికి సిఫార‌సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వ‌ని తిరుప‌తి తిరుమ‌ల దేవ‌స్థానం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది

  • Publish Date - March 16, 2024 / 02:46 PM IST

విధాత‌: లోక్‌సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో గ‌తంలో వ‌లె తిరుమ‌ల‌లో వ‌స‌తి, శ్రీవారి దర్శనానికి సిఫార‌సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వ‌ని తిరుప‌తి తిరుమ‌ల దేవ‌స్థానం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. స్వ‌యంగా వ‌చ్చే ప్రోటోకాల్‌ ప్రముఖులకు నిబంధనల ప్రకారం శ్రీవారి దర్శనం, వసతి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. లోక్‌స‌భ‌, అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేప‌థ్యంలో టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి నిర్ణ‌యం మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ది. శనివారం నుండి తిరుమ‌ల‌లో వ‌స‌తి, శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్ల‌డించింది. స్వ‌యంగా వ‌చ్చే ప్రోటోకాల్‌ ప్రముఖులకు, వారి కుటుంబ స‌భ్యుల‌కు నిర్దేశించిన విధివిధానాల మేర‌కు ద‌ర్శ‌నం, వ‌స‌తి క‌ల్పిస్తారని, ఎన్నికల ప్రక్రియ పూర్త‌య్యేవ‌ర‌కు ఏ రకమైన వ‌స‌తి, దర్శనాలకు కూడా సిఫారసు లేఖలు స్వీకరించబడవని తెలిపింది. భక్తులు ,వీఐపీలు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Latest News