Site icon vidhaatha

Warangal: కుంటలో పడి ఇద్దరు బాలురు మృతి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ నగర పరిధిలో శుక్రవారం విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇద్దరు బాలురు కుంటలో పడి మృతి చెందారు. నగర శివారు ఏనుమాముల ప్రాంతం చాకలి అయిలమ్మ నగర్‌కు చెందిన ఇద్దరు బాలురు ఈరోజు ఉదయం బహిర్భూమికని వెళ్లి సమీపంలోని కోట చెరువులో పడి మృతి చెందారు. మృతి చెందిన ఇరువురు బాలురులను కిరణ్ సింగ్, దీపక్ సింగ్ గా గుర్తించారు.

బహిర్భూమికని వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు అటుగా వెళ్లి చూడగా బాలురు చెరువులో పడినట్టు గుర్తించారు. అప్పటికే ఇద్దరు మృతి చెందారు. స్థానికులు మృతదేహాలను బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు.

సంఘటనకు సంబంధించిన సమాచారం పోలీసులకు అందించారు. ఇద్దరు పిల్లలు ఒకే కుటుంబానికి చెందిన వారుగా భావిస్తున్నారు. శ్రీరామనవమి పర్వదినం తెల్లారే ఆ ఇంట విషాదం నెలకొనగా, కన్నా తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిలింది.

Exit mobile version