విధాత: సూర్యాపేట జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మునగాల మండలం ఆకుపాముల వద్ద ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మహిళా కార్మికులు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను నడిగూడెం మండలం రామాపురంకు చెందిన ధనమ్మ వినోదలుగా గుర్తించారు. ప్రమాదంలో మరో ఇద్దరు మహిళలకు కూడా తీవ్ర గాయాలవగా వారిని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
జీహెచ్ఎంసీ కార్మికులు జాతీయ రహదారిపై డివైడర్ వెంట ట్రాక్టర్‌ను నిలిపి మొక్కలను కట్ చేస్తూ చెత్త ట్రాక్టర్ లో వేస్తున్నారు. వారు పనిలో ఉండగానే ఆ మార్గంలో వెళుతున్న లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపుతప్పి ట్రాక్టర్ను ఢీకొట్టడంతో ఇద్దరి కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.
మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తాము ట్రాక్టర్కు ముందు వెనక భాగాల్లో కొద్ది దూరం పాటు బారికెడ్ బిట్లు పెట్టుకొని పని చేస్తున్నప్పటికీ లారీ ఢీకొట్టడంతో ప్రమాద జరిగిందని బాధితులు వాపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా వెంటనే ట్రాక్టర్ లారీలను క్రేన్ల సహాయంతో పక్కకు తప్పించారు.