Site icon vidhaatha

ములుగు జిల్లాకు రెండు ట్రెయిన్‌డ్‌ డాగ్స్.. డ్యూటీలో చేరిక

అవేం (Officers) ఆఫీసర్లు కావు… అలా అని సిబ్బంది కూడా కాదూ… కానీ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయడంలో ప్రత్యేక శిక్షణ పొందిన (Dogs) డాగ్స్‌. కుక్కలంటే కాసింత నామోషిగా ఫీలైతావేమోనని కాసింత ఇంగ్లీషులో చెప్పానంతే. పోలీసు విభాగంలో అధికారుల, సిబ్బంది పని తీరుతో పాటు శిక్షణ పొందిన (trained) జాగిలాల పాత్ర కూడా గణనీయంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ములుగు జిల్లా పోలీసు విభాగంలో ప్రత్యేక శిక్షణ పొందిన రెండు నూతన డాగ్స్ సోమవారం (Duty) డ్యూటీలో చేరాయి.

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వివిధ రాష్ట్రాలకు సంబంధించిన 36 పోలీస్ జాగిలాలకు ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ( ఐఐటిఏ) మోయినాబాద్‌లో 16 జూన్ 2022 నుంచి 16 ఫిబ్రవరి 2023 వరకు 8 నెలల శిక్షణ ఇచ్చారు. ఇందులో (MULUGU)ములుగు జిల్లాకు గానూ పేలుడు పదార్థాల విభాగంలో ‘బ్రోనో'(BRONO) నార్కోటిక్ విభాగం నుండి ‘రాంబో’ (RAMBO)అను రెండు శునకాలు పూర్తి ఉత్తీర్ణత సాధించాయి.

శిక్షణలో పేలుడు పదార్థాల విభాగంలో ‘బ్రోనో’ ఏకంగా బంగారు పతకం సాధించిందట. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో వీటి ప్రత్యేకత రీత్యా ములుగు జిల్లాకు కేటాయించినట్లు చెబుతున్నారు. మందు పాతరలు, పేలుడు పదార్థాలను కనిపెట్టేందుకు ఉపయోగపడతాయని భావించి ఈ మేరకు తగిన ప్రాధాన్యత ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ కుక్కల కోసం ఇద్దరు హ్యాండ్లర్స్‌తో (handlers)పాటు అదనంగా మరొకరు విధులు నిర్వహిస్తుంటారు.

ఎస్పీ ముందు డాగ్స్ అటెండ్ (attend)

శిక్షణ అనంతరం బ్రోనో, రాంబోలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ గౌస్ ఆలం ముందు హాజరు పరిచారు. అంటే డ్యూటీ రిపోర్టు చేశాయన్న మాట. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ములుగు జిల్లా మావోయిస్టు ప్రాంతం అయినందున బ్రోనో, రాంబో సేవలు జిల్లాకు అత్యంత అవసరమని (essential)పేర్కొన్నారు.

డాగ్స్ నిర్వ‌హ‌ణ కోసం పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన కానిస్టేబుళ్లు ఎం.అశోక్ (బ్రోనో హ్యాండ్లర్ ), ఏ.రమేష్ (రాంబో హ్యాండ్లర్ ), జి అశోక్(స్పేర్ హ్యాండ్లర్ )లను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఏ.ఎస్.పి సదానందం, ఆర్.ఐ అడ్మిన్ స్వామి, ఆర్.ఐ ఆపరేషన్స్ కిరణ్, ఏ. ఆర్. ఎస్. ఐ రమేష్ పాల్గొన్నారు.

Exit mobile version