Site icon vidhaatha

UK Woman | ఆ యువ‌తికి న‌ర‌కం.. 14 నెల‌లుగా మూత్రం విస‌ర్జించ‌లేదు

UK Woman | ఒక రోజు మ‌ల‌మూత్ర విస‌ర్జ‌న చేయ‌క‌పోతేనే క‌డుపుంతా ఆందోళ‌న‌గా ఉంటుంది. దాని ప‌ర్యావ‌సనంగా అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా ఏర్ప‌డుతాయి. మూత్ర విస‌ర్జన( Urinate ) విష‌యంలో ఓ యువ‌తి 14 నెల‌ల పాటు న‌ర‌కం అనుభ‌వించింది. మూత్రం వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి రాక‌పోవ‌డంతో ఆమె తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంది. ఆమెకు వింత వ్యాధి సోక‌డంతోనే ఈ ప‌రిస్థితి ఏర్ప‌డిన‌ట్లు వైద్యులు తెలిపారు.

బ్రిట‌న్‌కు చెందిన ఎల్లీ ఆడ‌మ్స్( Elle Adams )(30) ఓ యువ‌తికి ఓ స‌మ‌స్య వ‌చ్చింది. అదేంటంటే.. మూత్ర విస‌ర్జ‌న స‌మ‌స్య‌. మూత్రం వ‌చ్చిన‌ట్టు అనిపిస్తుంది. కానీ వాష్‌రూమ్‌కు వెళ్తే మూత్రం రాదు. ఇలా 14 నెల‌ల పాటు న‌ర‌కం అనుభ‌వించింది. ఇక 2020, అక్టోబ‌ర్ నెల‌లో బాధితురాలు వైద్యుల‌ను సంప్ర‌దించింది. దీంతో వైద్యులు ఆమెకు మెడిక‌ల్ టెస్టులు నిర్వ‌హించ‌గా, పౌల‌ర్స్ సిండ్రోమ్‌( Fowler’s syndrome )తో బాధ‌ప‌డుతున్న‌ట్లు గుర్తించారు. ఈ క్ర‌మంలో ఆమెకు కెతెట‌ర్( catheter )(ర‌బ్బ‌ర్ ట్యూబ్) అనే ప‌రిక‌రం అమ‌ర్చి మూత్ర విస‌ర్జ‌న జ‌రిగేలా చేశారు డాక్ట‌ర్లు. ఇప్పుడు ఆ ట్యూబ్ ద్వారానే ఆమె మూత్ర విస‌ర్జ‌న చేస్తుంది. ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని డాక్ట‌ర్లు తెలిపారు.

అయితే మ‌హిళ‌ల మూత్రాశయంలో 500 మి.లీ. వ‌ర‌కు మూత్రం ఉంటుంద‌ని, పురుషుల మూత్రాశ‌యంలో 700 మి.లీ. వ‌ర‌కు మూత్రం ఉంటుంది. అయితే ఎల్లీ ఆడ‌మ్స్ మూత్రాశ‌యంలో లీట‌ర్ వ‌ర‌కు మూత్రం ఉండ‌టంతో ఆ యూరిన్‌ను కెతెట‌ర్ ద్వారా బ‌య‌ట‌కు తీశారు. తాత్కాలిక ఉప‌శ‌మ‌నం క‌లిగించేందుకు ఏర్పాటు చేసిన ఈ కెతెట‌ర్‌ను ప‌ర్మినెంట్ ఉంచాల్సి ఉంటుంద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. మూత్రాశ‌యంలో నుంచి మూత్రం బ‌య‌ట‌కు వెళ్లేందుకు వేరే మార్గం లేద‌ని, కేవ‌లం కెతెట‌ర్ ద్వారానే బ‌య‌ట‌కు విస‌ర్జించాల్సి ఉంటుంద‌ని చెప్ప‌డంతో ఆడ‌మ్స్ అంగీక‌రించింది. దీంతో మూత్ర విసర్జనకు కారణమయ్యే నాడుల్ని ప్రేరేపించి వెన్నుముక కింద ఓ చిన్న పరికరాన్ని అమర్చారు. దీంతో 14 నెల‌ల బాధ‌కు విముక్తి క‌లిగింది.

Exit mobile version