Site icon vidhaatha

పీఎం సూర్యఘర్‌ యోజనకు 75,021కోట్లు


విధాత : సోలార్ విద్యుత్తు విస్తరణలో భాగంగా కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం భేటీయైన కేంద్ర క్యాబినెట్‌లో పీఎం సూర్యఘర్‌ యోజన పథకం అమలుకు 75,021కోట్ల నిధులను కేటాయిస్తు నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద 2025నాటికి కోటి గృహాలకు ఉచితంగా సోలార్‌ విద్యుత్తు అందించడంతో పాటు కేంద్ర కార్యాలయాలపై సోలార్ ప్యానల్ ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది.


ఇటీవల బడ్జెట్‌లో ప్రకటించిన ఈ పథకానికి నిధులను మంజూరీ చేస్తూ కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. క్యాబినెట్‌ నిర్ణయాన్ని వెల్లడించిన కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సూర్యఘర్‌ యోజన పథకం కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించనున్నట్లుగా తెలిపారు. రూఫ్‌టాప్‌ సోలార్‌ ఏర్పాటుకు వెబ్‌సైట్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారని వెల్లడించారు.

Exit mobile version