Site icon vidhaatha

బండి సంజయ్‌పై కోడిగుడ్లతో దాడి

విధాత, హైదరాబాద్‌ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మీద కోడి గుడ్ల దాడికి పాల్పడ్డారు. వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో ప్రజాహిత యాత్ర చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బండి సంజయ్ కాన్వాయ్ మీద గుడ్లు విసిరారు. కోడిగుడ్ల దాడితో అసహనానికి గురైన బండి సంజయ్ నాడు పోలీసు బందోబస్తు ఏమీ వద్దని, మీరు వెళ్లిపోవాలని చెప్పారు.


నిన్న కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో హుస్నాబాద్‌లో సైతం బండి సంజయ్ యాత్రపై కోడిగుడ్లతో దాడులు జరిగాయి. మంత్రి పొన్నం ప్రభాకర్‌పైన బండి సంజయ్ చేసిన విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఆయన యాత్రపై దాడులకు పాల్పడుతున్నాయని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

Exit mobile version