విధాత,నాక్లాంగ్: థాయిలాండ్‌లో దారుణం జరిగింది. ప్రీస్కూల్ వద్ద ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇప్పటివరకు సమారు 32 మంది మృతి చెందినట్లు స్థానిక వార్తాపత్రికలు వెల్లడించాయి. మృతుల్లో అత్యధిక మంది చిన్నపిల్లలే ఉన్నారని పేర్కొన్నది.
ఈ ఘటన దేశంలోని ఈశాన్య ప్రాంతంలోని నాక్లాంగ్ జిల్లాలోని నాంగ్‌బు నాలంఫూ ప్రావిన్స్‌లో చోటు చేసుకొంది. కాల్పులకు పాల్పడిన దుండుగుడు తప్పించుకోవడంతో పోలీసులు అతడిని పట్టుకోవడానికి వేట మొదలుపెట్టారు.