Site icon vidhaatha

Matrimony | పెళ్లికాని అమ్మాయిలే టార్గెట్‌.. మ్యాట్రిమోని పేరుతో ఘరానా మోసం

Matrimony |

విధాత, హైద్రాబాద్: పెళ్లి కాని అమ్మాయిలే లక్ష్యంగా మ్యాట్రిమోని పేరుతో ఓ నైజీరియన్ చేస్తున్న మోసాలకు పోలీసులకు చెక్ పెట్టారు. నిందితుడు అలెక్స్ ను అరెస్టు చేసి మరింత మంది అమ్మాయిలు మోసపోకుండా చేయగలిగారు.

నార్త్‌జోన్ డీసీపీ చందనాదీప్తి తెలిపిన వివరాల మేరకు చదువు కోసం ఇండియాకు వచ్చిన నైజీరియన్ అలెక్స్ మ్యాట్రిమోని పేరుతో చేసిన మోసంపై ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన నిందితుడిని అరెస్టు చేశారు.

అలెక్స్ 1020కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికవరకు అతడికి సంబంధించి 12సైబర్ కేసులను పోలీసులు చేధించారు. మ్యాట్రిమోనిలో చేరిన అమ్మాయిలకు తప్పుడు ప్రొఫైల్స్ ఇవ్వడం, వారికి మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేయడం అలెక్స్ కొనసాగించాడు.

బాధిత అమ్మాయిని కూడా అలాగే మోసం చేసి 14లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. ఆమెను నమ్మించేందుకు ఇంటికి పంపిన బాక్స్‌తో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో అలెక్స్ మోసాలు వెలుగుచూశాయి.

నిందితుడు అంతర్జాతీయ స్థాయిలో నేరాలకు పాల్పడ్డాడని, అతడి నుంచి 68సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నామని, 1025కేసుల్లో నిందితుడు సెల్ నెంబర్‌ను క్రైమ్ పోర్టల్‌లో గుర్తించామని, ఇప్పటిదాకా 12కేసులు చేధించామని, కస్టడీలో మిగతా కేసుల విచారణ సాగిస్తామని డీసీపీ తెలిపారు.

Exit mobile version