Site icon vidhaatha

Hanumantha Rao | వీహెచ్ మౌన దీక్ష.. భట్టిపై ఫైర్

ఖమ్మం టికెట్ రాకపోవడంపై కినుక

విధాత: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు అంబర్‌పేటలోని తన నివాసంలో మౌన దీక్షకు సిద్ధమయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విహెచ్ మీడియాతో మాట్లాడారు. ఖమ్మం టికెట్ తనకు రాకుండా కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వెళ్లగక్కారు. తమ్ముడనుకున్న భట్టి విక్రమార్క తనకు టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. భట్టి నాకు ఇలా అన్యాయం చేస్తారని ఊహించలేదని వాపోయారు.

గతంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని మాట్లాడినందుకు తనపై కక్ష గట్టారని అవేదన చెందారు. తనకు టికెట్ రాకుండా ఉండేందుకు బయట వారిని తీసుకొస్తున్నారని, దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలన్నారు. తాను బీజేపీకి అనుకూలంగా మాట్లాడినట్లుగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, దీనిపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు. తనను ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతు దీక్షకు దిగబోతున్నట్లుగా తెలిపారు.

Exit mobile version