Site icon vidhaatha

Vande Bharat Express | భారతీయ రైల్వే కీలక నిర్ణయం..! వందే భారత్‌ రైళ్లలో ఆరు నెలల పాటు ప్యాకేజీ ఫుడ్‌పై నిషేధం..!

Vande Bharat Express | భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యానికి పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగా వేగంతో పాటు సుఖవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు కృషి చేస్తున్నది. ఈ క్రమంలోనే కొత్త వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు దాదాపు 30కిపైగా సెమీ హైస్పీడ్‌ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో పరుగులుపెడుతున్నాయి. ఆయా రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. అయితే, ప్రయాణికుల నుంచి వస్తున్న ఫీడ్‌ బ్యాగ్‌ను రైల్వేశాఖ ఎప్పటికప్పుడు తీసుకుంటూ మార్పులు చేస్తున్నది. ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది.

వందే భారత్ ట్రైన్లలో లంచ్, డిన్నర్ ఆర్డర్ చేసే ప్రయాణికులకు మెనూలో లేని పదార్థాలు కలిపి విక్రయిస్తున్నారని, ఫుడ్ ఐటమ్స్‌కు సంబంధించిన కవర్లన్నీ కోచ్‌లో పడేయడంతోనే అపరిశ్రుభత ఏర్పడుతుందని, పలువురి ప్రయాణికుల సౌకర్యానికి భంగం కలుగుతుందని ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రయాణికుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని బేకరీ ఉత్పత్తులు, స్వీట్స్, కూల్ డ్రింక్స్, లా కార్టే ఐటెమ్స్‌ తదితర వాటిని ఆరు నెలలు నిషేధించింది. ఫుడ్ కవర్లు కోచ్‌లలో పడేయడం వల్ల పలుసార్లు డోలర్లలో ఇరుక్కుపోతున్నాయి. దీంతో ఆటోమెటిక్‌ కావడంతో వాటంతటవే ఓపెన్‌ అవుతున్నాయి. దీంతో పాలు కోచ్‌లలో దుర్వాసన వెదజల్లుతున్నది. ఈ కారణాలతో రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు వందే భారత్ రైళ్లలో ఎలాంటి ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారనే విషయంలోనూ కొంత గందరగోళ పరిస్థితులున్నాయి. ఇకపై ప్రయాణికులకు క్యాటరింగ్‌ సేవలకు సంబంధించి ముందస్తుగా బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

వందే భారత్‌ రైళ్లలో ప్రయాణానికి 24-48 గంటల ముందుగా ప్రయాణికులకు రీ కన్ఫర్మేషన్‌ మెసేజ్‌ వస్తుంది. సందేశంలో ప్రయాణికులకు ఇవ్వనున్న ఆహారానికి సంబంధించి వివరాలు ఉండనున్నాయి. దీంతో ప్రయాణికులకు అనుకూలంగా ఉండనున్నది. అయితే. రైలులో భోజనం ఆర్డర్‌ చేసే వారికి రూ.50 అదనంగా ఛార్జీలు వసూలు చేయనున్నారు. మరో వైపు రైల్వే మంత్రిత్వ శాఖ ఐఆర్‌సీటీసీని రెండు ట్రిప్పుల కోసం ‘రైల్‌ నీర్‌’ వాటర్‌ బాటిల్స్‌ను ఎక్కువగా నిల్వ చేయొద్దని ఆదేశించింది. రెండు ట్రిప్పులకు ఒకేసారి బాటిల్స్‌ను నిల్వ చేయడం ద్వారా భారీగా స్థలం తీసుకుంటుందని పేర్కొంది. ఒకే ట్రిప్‌ కోసం నిల్వ చేయనున్నారు. రైలు తిరిగి వచ్చే సమయంలో మరోసారి ఫిల్‌ చేయనున్నారు.

Exit mobile version