- ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా
విధాత: వాన నీటితో నిండిన గుంతలో కారు పడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో విదిశ జిల్లాలో సోమవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకున్నది.
హైదర్‌గఢ్ గ్రామంలోని తమ వ్యవసాయ క్షేత్రానికి కుటుంబం వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు మంగళవారం వెల్లడించారు.
డ్రైవర్ కారు రివర్స్ తీస్తుండగా రోడ్డు వెంట ఉన్న వాననీటితో నిండిన గుంతలో పడిపోయింది. నీటిలో కారు మునిగిపోవడంతో మహిళసహా ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు. కారులో ఉన్న మరో ఇద్దరిని సమీప గ్రామస్థులు రక్షించారు.
వారిని హుటాహుటిన దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతున్నారు. ముగ్గురు పిల్లల మృతదేహాలను నీటిలో, మరొకరి మృతదేహాన్ని కారులో నుంచి ఎస్డీఆర్ ఎఫ్ బృందం వెలికి తీసినట్టు జిల్లా ఏఎస్పీ తెలిపారు.