విధాత: తెలుగుదేశాన్ని, ఎన్టీయార్ కుటుంబాన్ని.. వీలును బట్టి బాలయ్య బాబును సైతం ట్విట్టర్, ఫెసుబుక్కులో తన పదునైన కామెంట్లతో కబాడీ ఆడుకునే విజయసాయిరెడ్డి తాజాగా బాలయ్య బాబుకు ఓ విషయంలో థాంక్స్ చెప్పారు.
రాజకీయాల కన్నా కుటుంబ బంధం, మానవ సంబంధాలు ముఖ్యమైనవి అని రుజువు చేశారు. గుండె పోటుతో బెంగళూరులో చికిత్స పొందుతున్న తారకరత్నను ఆయన భార్య తరుఫు బంధువు అయిన ఎంపీ విజయ సాయిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా తారకరత్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చారు.
‘తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంది. గుండెపోటు వచ్చిన రోజు 45 నిమిషాల పాటు మెదడుకు రక్తప్రసరణ ఆగిపోయినందున మెదడులో పైభాగం కొంత దెబ్బతింది. వాపు తగ్గాక కోలుకుంటారని డాక్టర్లు చెప్పారు. గుండె చక్కగా పనిచేస్తోంది. రక్తప్రసరణ బాగుంది. బాలకృష్ణ అన్ని సౌకర్యాలను దగ్గరుండి చూసుకుంటున్నారు. బాలయ్యకు కృతజ్ఞతలు’ అని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.
తారకరత్నను పరామర్శించిన విజయసాయిరెడ్డి.. బాలకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు..
FULL VIDEO – https://t.co/DfyEq6OCuZ#VijayaSaiReddy #NandamuriTarakaratna #TarakaRatna #TarakaratnaHealthUpdate #NTR #Balakrishna #NTVTelugu pic.twitter.com/TYhRSQNvOf
— NTV Telugu (@NtvTeluguLive) February 1, 2023
విజయసాయి రెడ్డి భార్య చెల్లెలి కూతురు ఆలేఖ్య రెడ్డి తారకరత్నను ప్రేమ వివాహం చేసుకున్న నేపథ్యంలో తారకరత్న విసారే కు అల్లుడి వరస అవుతారు. ఇదిలా ఉండగా గుండెపోటుతో ఆయన కుప్ప కూలడంతో 45 నిమిషాలు గుండె ఆగిపోవడం వల్ల మెదడులో పైభాగం దెబ్బతిన్నదని.. దాని వల్ల మెదడులో నీరు చేరి మెదడు వాచిందని వైద్యులు తెలిపారని విజయసాయిరెడ్డి అన్నారు. వాపు తగ్గిన వెంటనే బ్రెయిన్ రికవరీ అవుతుందని డాక్టర్లు తెలిపారు.
ఇక ఆస్పత్రిలో చేరిన తారకరత్నను బాలయ్యబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కర్ణాటక ప్రభుత్వ సాయంతో ప్రత్యేక చికిత్స అందేలా చూస్తున్నారు. ఆయనకు వైద్యం అందుతున్న తీరును, తారక రత్న ఆ వైద్యానికి స్పందిస్తున్న తీరును నిత్యం పర్యవేక్షిస్తూ ఆయన కొలుకునేందుకు బాలయ్య ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నరు.