Site icon vidhaatha

నన్ను ఇరిటేట్ చేస్తే పేపర్ పెడతా.. రామోజీరావుకు విజయసాయి అల్టిమేటం

ఉన్న‌మాట‌: నన్ను కన్ఫ్యూజ్ చేయకండి.. కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తా అంటాడు కదా మహేష్ బాబు.. అచ్చం అలాంటి డైలాగ్ కొట్టారు ఎంపీ విజయసాయి రెడ్డి. తన వ్యక్తిత్వాన్ని డ్యామేజ్ చేసేందుకు ఈనాడు ఎక్కువ కష్టపడుతోందని, తనను ఇలాగే ఇరిటేట్ చేస్తే తానే ఓ పత్రిక, టివి ఛానెల్ పెట్టి రామోజీ రావుకు పోటీగా నిలబడతానని అల్టిమేటం ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈనాడు రామోజీరావుకు కౌంటర్ ఇచ్చేందుకే తాను మీడియా రంగంలోకి రాబోతున్నట్లుగా ఆయన ప్రకటించారు. రామోజీ రావు మీడియా అంతా తనను, వైసీపీని నిరాధారమైన ఆరోపణనలతో నిందించడమే పనిగా పెట్టుకుంది అని ఆయన మండిపడ్డారు. అయితే ఈనాడు ను కౌంటర్ చేసేందుకు సాక్షి ఉందిగా అని ఒక విలేకరి ప్రశ్నించగా సాక్షి దమ్ము సరిపోవడం లేదని ఆయన అన్నారు.

రామోజీరావు తన మీడియా ద్వారా చేసే ఆరోపణలను సాక్షిగా గట్టిగా ఖండించలేకపోతోంది అని చెబుతో . అందుకే తాను మీడియా ఫీల్డ్ లోకి అడుగుపెడుతున్నట్లుగా వివరించారు. ఇదిలా ఉంటే విశాఖలో తనకు ఒక ప్లాట్ తప్ప ఏ ఒక్క స్థలం కానీ భూమి కానీ లేదన్నారు. అయితే రామోజీరావు తన మీడియా సంస్థ ద్వారా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని విజయసాయి అయ్యారు.

తన ఆస్తుల మీద సీబీఐ కాదు అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలతో అయినా విచారణకు సిద్ధమని చంద్రబాబు రామోజీరావు అలాంటి విచారణకు రెడీ యేనా అని ఆయన సవాల్ చేశారు. అపుడు ఎవరు జైలుకు వెళ్తారో తెలుస్తుంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖకు రాజధాని రాకూడదనే బాగా దిగజారిపొయి నీచ ఆరోపణలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి అంటున్నారు.

విశాఖ దసపల్లా భూముల వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పుని అమలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది అని ఆయన పేర్కొన్నారు. తాము ఈ విషయంలో అంతా పారదర్శకంగా చేస్తే లేని పోని ఆరోపణలు చేయడమే టీడీపీ వత్తాసు మీడియా పనిగా పెట్టుకుంది అని ఆయన విమర్శించారు. ఇదిలా ఉండగా రామోజీ మీద కోపంతో అయినా విజయసాయి ఓ మీడియా తీసుకొస్తే కొందరు జర్నలిష్టులకు ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు.. చూడాలి మరి ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారో.

Exit mobile version