Site icon vidhaatha

Viral Video | నిమిషాల్లోనే ఇడ్లీలు రెడీ..! ఆనంద్‌ మహీంద్రాను ఫిదా చేసిన హోటల్‌ యజమాని

Viral Video | తెల్లవారిందంటే రెడీ అయ్యాక అందరూ టిఫిన్‌ చేయందే తమ పనులకు వెళ్లారు. కొందరు ఇంట్లో అల్పాహారం తీసుకుంటే.. మరికొందరు టిఫిన్‌ సెంటర్ల ముందు క్యూ కడుతుంటారు. వచ్చిన కస్టమర్లకు వేగంగా టిఫిన్స్‌ అందించేందుకు హోటల్స్‌ సిబ్బంది కష్ట పడుతుంటారు.

అయితే, కొందరు తమ నైపుణ్యంతో ఆకట్టుకుంటారు. తాజా ఓ వ్యక్తి కస్టమర్ల కోసం ఇడ్లీలు తయారు చేస్తున్న తీరు ఆకట్టుకుంటున్నది. నిమిషాల వ్యవధిలోనే వందల సంఖ్యలో ఇడ్లీలు తయారు చేస్తూ.. వేడివేడిగా కస్టమర్లకు అందిస్తున్నాడు.

ఈ వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేయగా.. వైరల్‌గా మారింది. వీడియోలో ఉన్న ప్రకారం.. ఓ వ్యక్తి పెద్ద ఇడ్లీ ప్లేట్లన్నీ ఓ టేబుల్‌పై వరుసగా పెట్టి.. దానిపై ఆయిల్‌ను స్ప్రే చేశాడు. తర్వాత ఓ పెద్ద పాత్రలో ఇడ్లీ పిండిని ఓ మగ్గుతో పిండిని ఇడ్లీప్లేట్లలో పోసి.. మాప్‌ లాంటిది తీసుకొని మిగతా పిండిని తీసివేశాడు.

వాటిని తీసుకెళ్లి ఇడ్లీలను ఉడికించే పాత్రలు వేశాడు. ఆ తర్వాత కొద్ది నిమిషాల్లోనే ఇడ్లీలు తయారుకాగా.. వాటిని వేగంగా చేతులతో తీసి ఓ పెట్టెలో వేశాడు. అనంతరం కస్టమర్లతో పాటు అక్కడికి వచ్చిన ఓ గోమాతకు సైతం ప్రేమగా తినిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్ల మనసు దోచుకుంటున్నది.

ఈ సందర్భంగా ఆనంద్‌ మహీంద్రా వీడియోను షేర్‌ చేస్తూ.. ఇండ్లల్లో ఆడవారు నెమ్మెదిగా.. శ్రద్ధగా ఇడ్లీలు వేయడం మనం చూశాం. వ్యాపారులు ఇలా భారీ స్థాయిలో ఇడ్లీలు రెడీ చేస్తుంటారు. పద్ధతి ఏదైనా అందులో ఓ మానవీయకోణం, భారతీయత కొట్టొచ్చినట్టు కనబడుతుంది’ అంటూ కామెంట్‌ చేశారు.

ఈ వీడియోను ఇప్పటి వరకు 11లక్షల మందికిపైగా వీక్షించారు. ఈ వీడియోను చూసిన పలువురు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. రోజుకు ఎన్ని కిలోల బియ్యం రుబ్బుతారు..? ఒకరు కామెంట్‌ చేయగా.. ఇక్కడ పరిశుభ్రత పాటించడం నాకు కనిపించడం లేదు! మరొకరు కామెంట్‌ చేశారు. ఈ కామెంట్‌ చేసిన మరో నెటిజన్‌ అదో పీడకల అంటూ స్పందించారు.

Exit mobile version