Elon Musk |
విధాత: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత్‌కు చెందిన వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ పడేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఆ పార్టీ అభ్యర్ధిత్వం కోసం ఆయన ఇప్పటికే ప్రచారం కూడా మొదలు పెట్టారు. తాజాగా వివేక్ రామస్వామిపై బిలియనీర్ ఎలన్ మస్క్ ప్రశంసలు కురిపించారు. ఎక్స్ సోషల్ మీడియా అకౌంట్‌లో వివేక్‌కు చెందిన ఓ వీడియోను ఆయన పోస్టు చేశారు. ఫాక్స్ న్యూస్ యాంకర్ టక్కర్ కార్ల్‌సన్‌తో జరిగిన సంభాషణను ఆ వీడియోలో అప్‌లోడ్ చేశారు.
వివేక్ రామస్వామి చాలా ప్రామిసింగ్ గా ఉన్నట్లు మస్క్ తెలిపారు. 37 ఏళ్ల రామస్వామి.. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా పోటీపడేందుకు ఆసక్తిగా ఉన్నారని, ఈ అభ్యర్థి విశ్వసనీయంగా కనిపిస్తున్నట్లు మస్క్ తన ఎక్స్ అకౌంట్‌లో పేర్కొన్నారు.
He states his beliefs clearly. https://t.co/SjpuXLCFpo
— Elon Musk (@elonmusk) August 18, 2023
కాగా ఇటీవల మస్క్ చైనాలో పర్యటించిన సమయంలో వివేక్ ఆయనపై విమర్శలు గుప్పించారు. చైనాకు అనుకూలంగా వ్యవహారించే వ్యాపార వేత్తలు ఆమెరికాకు అవసరం లేదంటు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనపై విమర్శలు చేసినప్పటికి మస్క్ మాత్రం వివేక్ అభ్యర్ధిత్వాన్ని ప్రశంసించేలా మాట్లాడటం గమనార్హం.
గతంలో డోనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థిగా పోటీ చేసిన రాన్ డీసాంటిస్‌కు ఎలన్ మస్క్ మద్దతు ఇచ్చారు. భారత సంతతికి చెందిన వివేక్ 1985ఆగస్టు 9న ఒహియోలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కేరళ నుంచి ఆమెరికాకు వలస వెళ్లారు.
వివేక్ రామస్వామి హార్వర్డ్, యేల్ యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వివేక్ రామస్వామితో పాటు భారత మూలాలు ఉన్న నిక్కీ హేలీ, హర్ష వర్దన్ సింగ్ లు కూడా రిపబ్లికన్ పార్టీ తరపున డోనాల్డ్ ట్రంప్‌కు పోటీగా అధ్యక్ష ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు.
He is a very promising candidate https://t.co/bEQU8L21nd
— Elon Musk (@elonmusk) August 17, 2023