Site icon vidhaatha

WANAPARTHY: పంట పొలాల్లోకి వచ్చిన భారీ మొసలి

విధాత: వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని వెళటూరు గ్రామంలోని బుగ్గిచెరువు సమీపంలోని వ్యవసాయ పొలంలో రైతులకు మొసలి కనిపించడం స్థానికంగా కలకలం రేపుతోంది.

పంట పొలాల్లో మొసలి కనిపించడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు గ్రామస్తుల సహకారంతో మొసలిని పట్టుకున్నారు. జూరాల డ్యాంలో మొసలిని విడిచి పెడతామని అధికారులు తెలిపారు.

Exit mobile version