Warangal
- గాయపడిన అన్న-చెల్లెల్లను ఆసుపత్రికి తరలింపు
- వైద్యం అందించాలని వైద్యులకు సూచన
- పరీక్ష బాగా రాయాలని ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎంసెట్ పరీక్ష రాయడానికి వెళుతున్న “ధారావత్ ఆశ్విత” ఆమె అన్నకు చెన్నరావుపేట మండలం జల్లి క్రాస్ రోడ్ వద్ద గురువారం యాక్సిడెంట్ జరిగింది.
అటువైపుగా వెళ్తున్న శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గమనించి గాయపడిన ఇద్దరు అన్న-చెల్లెలను ప్రథమ చికిత్స కోసం నర్సంపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. వెంటనే అన్న-చెల్లెలకు వైద్యం అందించాలని వైద్యులను కోరారు.
చికిత్స అనంతరం అశ్వితను ఓదార్చి, పరీక్ష బాగా రాయాలని ధైర్యంగా ఉండాలని ‘All the Best’ చెప్పి పంపించారు.