జర్నలిస్టు సుధాకర్ రావు కుటుంబాన్ని ఆదుకుంటాం: ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఇటీవల మృతిచెందిన సీనియర్ జర్నలిస్టు, జర్నలిస్టు యూనియన్ నాయకులు మారబోయిన సుధాకర్ రావు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ అన్నారు. సోమవారం టీయూడబ్ల్యూజేే (ఐజేయు) హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వడ్డేపల్లి లోని సుధాకర్ రావు నివాసం వద్ద సుధాకర్ రావు సంతాప సభ జిల్లా శాఖ అద్యక్షుడు గడ్డం రాజిరెడ్డి అద్యక్షతన జరిగింది. ఈ సభలో పాల్గొన్న వినయభాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో […]

  • Publish Date - March 13, 2023 / 01:43 PM IST

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఇటీవల మృతిచెందిన సీనియర్ జర్నలిస్టు, జర్నలిస్టు యూనియన్ నాయకులు మారబోయిన సుధాకర్ రావు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ అన్నారు. సోమవారం టీయూడబ్ల్యూజేే (ఐజేయు) హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వడ్డేపల్లి లోని సుధాకర్ రావు నివాసం వద్ద సుధాకర్ రావు సంతాప సభ జిల్లా శాఖ అద్యక్షుడు గడ్డం రాజిరెడ్డి అద్యక్షతన జరిగింది.

ఈ సభలో పాల్గొన్న వినయభాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమమే ద్యేయంగా సుధాకర్ రావు పని చేశారని, ఆయన మృతి జర్నలిస్టు లోకానికి తీరని లోటు అని అన్నారు. ప్రభుత్వ పరంగా, తన వ్యక్తిగతంగా ఆయన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు దాసరి క్రిష్ణా రెడ్డి మాట్లాడుతూ తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఉమ్మడి జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమం కోసం సుధాకర్ రావు పని చేశారని అన్నారు.

చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు కూడా అండగా నిలిచారని, అంతగా సేవలు అందించిన నాయకులు ఉమ్మడి జిల్లాలోనే మరొకరు ఉండరని కొనియాడారు. ఈ సందర్భంగా సుధాకర్ రావు సతీమణికి చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ రూ. 25వేల ఆర్థిక సహాయాన్ని అందించగా, పలువురు జర్నలిస్టుల ఆద్వర్యంలో మరో రూ. 43 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. సంతాప సభలో తొలుత సుధాకర్ రావుకు నివాళిగా జర్నలిస్టులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజేే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి గాడిపెల్లి మధు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి. వెంకటరమణ, గుంటి విద్యాసాగర్, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్, ప్రెస్ క్లబ్ అద్యక్ష,కార్యదర్శులు వేముల నాగరాజు,బొల్లారపు సదయ్య, మాజీ ప్రెస్ క్లబ్ అద్యక్షులు గడ్డం కేశవమూర్తి, పిన్నా శివకుమార్,

ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు సంగోజు రవి, నల్లాల బుచ్చిరెడ్డి, నార్లగిరి యాదగిరి, కొండం రవీందర్ రెడ్డి, ఎన్ ఎస్ రావు, నాయకులు కంకనాల సంతోష్, అలువాల సదాశివుడు, పి. రాజేందర్, ఎం. రాజేంద్ర ప్రసాద్, బోయిని బిక్షపతి, బెలిదే శ్రీనివాస్, ఆర్ వి. ప్రసాద్, శోభన్ బాబు, పోగుల కుమార్, ఎండి ఉస్మాన్ పాషా, తాండూరి గోపి తదితరులు పాల్గొన్నారు.

Latest News