Site icon vidhaatha

సీఎం రేవంత్‌తో వెస్ట్ర‌న్ ఆస్ట్రేలియా మంత్రి సాండ‌ర్స‌న్ భేటీ

విధాత‌: వైద్య రంగంలో తెలంగాణలో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ఆస్ట్రేలియా ఆస్త‌కి చూపిస్తోంది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం సీఎం రేవంత్‌ రెడ్డితో వెస్ట్ర‌న్ ఆస్ట్రేలియా మంత్రి సాండర్సన్(Sanderson) స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా హెల్త్ కేర్, హెల్త్ టూరిజం, హెల్త్ స్కిల్లింగ్ లో పెట్టుబడులకు అవకాశాలున్నాయని సాండ‌ర్స‌న్‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. స్కిల్ క్యాపిటల్ గా హైదరాబాద్ మారబోతోందని చెప్పారు. జిల్లా ఆసుపత్రులను మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులుగా తీర్చిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ చొరవతోనే హైదరాబాద్ లో ఫార్మా కంపెనీలు వచ్చాయనిసీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.

Exit mobile version