Site icon vidhaatha

శాకుంతలం: ఏం చేసినా.. సమంతానే చేయాలి..!

విధాత‌, సినిమా: ఒకవైపు నాగచైతన్యతో విడాకులు మరోవైపు మయోసైటీస్ అనే వ్యాధితో ఇటీవల సమంత చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. తాజాగా ఆమె తన అనారోగ్యం నుంచి కోలుకుంటున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె ముంబైలో రాజ్- డీకే దర్శ‌క ద్వయం రూపొందిస్తున్న సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.

ఇక సమంత అనారోగ్యంగా ఉన్న దానిని తట్టుకోగలిగిన శక్తి తనకు ఉందని భావిస్తోంది. అంతేకాకుండా ఇప్పుడు తనకు పెద్దగా అనారోగ్య లక్షణాలు బాధించడం లేదని సన్నిహితులతో చెబుతుందట. ఇక విషయానికి వస్తే సమంత ప్ర‌ధాన పాత్రలో నటించిన తొలి మైథ‌లాజికల్ మూవీ శాకుంతలం. స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ అత్యంత భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తీశారు.

స్వీయ దర్శకత్వంలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మించారు. దిల్ రాజు స‌మ‌ర్ప‌కుణిగా వ్యవహరి స్తున్నారు. 3d ఐమాక్స్ ఫార్మేట్‌లో అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమా రూపొందుతోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. ఫిబ్రవరి 17న ఈ సినిమా విడుదల కానుంది.

పాన్ ఇండియా చిత్రం కావడంతో ఇక ఈ సినిమా విడుదలకు కేవలం ప‌ది ప‌దిహేను రోజులు మాత్రమే సమయం ఉండ‌టంతో ఈలోపు ప్రమోషన్స్ లో వేగం పెంచాలి. లేకపోతే పాన్ ఇండియా లెవెల్ లో ఓపెనింగ్స్ రావడం కష్టం. శాకుంతలం లేడీ ఓరియంటెడ్ ఫిలిం.

సమంతానే మెయిన్. దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటించిన అతను తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం ఉన్న వ్యక్తి కాదు. సో ప్రమోషన్ అంటూ ఏమైనా చేస్తే అది సమంతానే చేయాలి. ఆమె ప్రమోషన్స్ లో పాల్గొనాలి. శాకుంతలం విషయానికి వచ్చేసరికి బడ్జెట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ఈ చిత్రాన్ని గుణ‌శేఖ‌ర్ భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. రుద్ర‌మ‌దేవి త‌రహాలో భారీగా ఖ‌ర్చు పెట్టాడ‌ని స‌మాచారం. రుద్ర‌మ‌దేవికైతే క‌నీసం గోన‌గ‌న్నారెడ్డిగా న‌టించిన అల్లు అర్జున్ అయినా ఉన్నారు. కానీ శాకుంత‌లంకి స‌మంత త‌ప్పించి మ‌రెవ్వ‌రు లేరు.

ఇప్పటి నుంచైనా భారీగా ప్రమోట్ చేస్తేనే ఈ మూవీకి అనుకున్న స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయి. ప్రేక్షకులు కూడా భారీ స్థాయిలో సింపతి కోసం థియేటర్లకు వస్తారు. అందుకే మేకర్స్ ఎలాగైనా స‌మంత‌ను ప్రమోషన్స్ కోసం వారి స్థాయిలో వాడేయ్యాలని భావిస్తున్నారు.

అదే సమయంలో ఆమె అనారోగ్యం రీత్యా ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదని అభిప్రాయంలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇంతకీ ఈ ప్రమోషన్స్ కు సమంతా వైపు నుంచి ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ వచ్చిందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇప్పుడు శాకుంతల మొత్తం సమంత చేతిలో ఉంది. ఈ చిత్రాన్నిగట్టెక్కించాల్సిన బాధ్య‌త ఆమె మీద‌నే ఉంది. ఈ చిత్రానికి సరైన ఓపెనింగ్స్ రావాలన్నా, బ‌జ్ క్రియేట్ కావాలన్నా అది కేవలం సుమంత‌ వల్లనే సాధ్యమవుతుంది. ఆమె చేతులెత్తేస్తే మాత్రం పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది.

Exit mobile version