WhatsApp | ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) యూజర్లకు మరో శుభవార్త చెప్పింది. ఎప్పటికప్పుడు యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్న వాట్సాప్.. మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
వాట్సాప్ ఐఓఎస్ (iOS) యూజర్ల కోసం పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ (picture in picture mode) అనే కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇంతకు ముందు బీటా టెస్టర్లకు మాత్రమే పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ అందుబాటులో ఉండేది.
తాజాగా స్టేబుల్ వెర్షన్‌ను వినియోగిస్తున్న యూజర్లకు సైతం అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందో వివరించింది. ఆపిల్ స్టోర్ (Apple Store) నుంచి యాప్‌ను అప్‌డేట్ చేస్తే మీ అకౌంట్‌లో ఫీచర్ అందుబాటులో ఉందో? లేదో తెలుస్తుంది.
కొత్త అప్‌డేట్‌లో డాక్యుమెంట్లకు క్యాప్షన్లను జోడించగల సామర్థ్యం, లంగర్ గ్రూప్ డిస్క్రిప్షన్ తదితర కొత్త ఫీచర్లు సైతం ఉన్నాయి. త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానున్నది. అయితే, కొత్త ఫీచర్ల కోసం ఎప్పటికప్పుడు యాప్‌ను అప్‌డేట్ చేస్తూ ఉండాలని వాట్సాప్ సూచించింది.