Site icon vidhaatha

మెగాస్టార్ తర్వాతి దర్శకుడు ఎవరు.. మారుతీనా, వెంకీనా?

విధాత‌, సినిమా: మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యతో తన పని అయిపోయింది అని అన్నవారి నోళ్లు మూయించారు. తనదైన యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ కథ దొరికితే బాక్సాఫీస్ వద్ద తనకు తిరిగే ఉండదని మరోసారి నిరూపించుకున్నారు. సరైన కంటెంట్ తో చిత్రం చేస్తే తన సత్తా 200 కోట్లకు పైగా ఉంటుందని చేతల్లో నిరూపించారు.

కాగా మెగాస్టార్ రీ ఎంట్రీ ఖైదీ నెంబర్ 150 తో ప్రారంభమైంది. దాని తరువాత సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్ వంటి చిత్రాలు వచ్చాయి, ఆచార్య డిజాస్టర్ అయింది. ఖైదీ నెంబర్ 150, సైరా, గాడ్ ఫాదర్ లు ఓకే అనిపించాయి. కానీ వాటన్నిటి బాకీని వాల్తేరు వీరయ్యతో వడ్డీతో సహా మెగాస్టార్ తిరిగి ఇచ్చేశారు.

ఇంకా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తమిళంలో అజిత్ నటించిన వేదాళం రీమేక్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇప్పటివరకు సక్సెస్ అనేదే తెలియని మెహర్ రమేష్ దర్శకుడు కావడం విశేషం. బోళా శంకర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. దీని తరువాత చిరు చేయబోయే చిత్రం ఏమిటనే దానిపై పలు ఊహాగానాలు వస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం చిరంజీవి వెంకీ కుడుములతో ఓ సినిమా చేయబోతున్నారు. దీనిని ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య నిర్మించబోతున్నట్లు సమాచారం. అలాగే డాక్టర్ మాధవి రాజ్ సహనిర్మాతగా వ్యవహరించునున్నారట. ఈ విషయాన్ని నేరుగా చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇక చిరుతో సినిమా చేయాలని ప్రతి నిర్మాతకు ఉంటుంది.

Exit mobile version