- పవన్‌ని తిడుతుంటే.. బాధగా ఉంది: చిరంజీవి
విధాత: సినీ రంగంలో మెగాస్టార్ చిరంజీవి చాలా మృదుస్వభావి. ఎదుటి వారిని నొప్పించకుండా.. వారిని బాధ పెట్టకుండా చాలా సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ వెళ్తారు. పెద్దగా ఆవేశ పడరు. ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తారు. ఎవరైనా విమర్శించినా అది వారి విజ్ఞతకే వదిలేస్తారు. కానీ దానికి బదులు ఇవ్వరు.
కానీ ఈ త్రిమూర్తులలో మిగిలిన ఇద్దరైన నాగబాబు, పవన్ కళ్యాణ్‌లు అలా కాదు. వారు చిరుపై ఈగ వాలితే ఇక దుమ్మురేపుతారు. వారిని కడిగి పారేస్తారు. ఉతికి ఆరేస్తారు. వెంటనే బదులు తీర్చుకుంటారు. విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన అధినేతగా ఏపీ రాజకీయాలలో ఒకవైపు.. సినిమాల్లో మరోవైపు బిజీ బిజీగా గడుపుతున్నారు.
అయితే ఆయన వ్యక్తిగత జీవితంపై మరీ ముఖ్యంగా మూడు పెళ్లిళ్లపై వైసీపీ నేతలు పదే పదే ఆయనను విమర్శిస్తున్నారు.. కొందరైతే ఏకంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరుకి ద్రోహం చేసింది నువ్వే అంటూ మాట్లాడుతున్నారు. చిరంజీవిని నాశనం చేసింది నువ్వే.. అనే వ్యాఖ్యలు నన్ను ఎంతో బాధించాయని.. ఆ విమర్శలకు తాను బాధ పడ్డానని కూడా ఒకసారి ఇండైరెక్ట్ గా పవన్ చెప్పుకొచ్చాడు.
మీ అన్నయ్యకే దిక్కులేదు.. నీవేం చేస్తావు.. నీవేం పెరుకుతావు.. నీవేం పీకుతావు అంటూ రెచ్చగొడుతూ ఉంటారు వైసీపీ బ్యాచ్. ముఖ్యంగా రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని, గ్రంధి శ్రీనివాస్, అనిల్ వంటి వారు పవన్ పై రెచ్చిపోతూ ఉంటారు.
ఇటీవల బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికె 2 ఎపిసోడ్‌కు పవన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి బాలయ్య పవన్‌ను నేరుగా ప్రశ్నించాడు. దానికి పవన్ తనదైన వివరణ ఇచ్చాడు.
ఇదంతా విన్న తర్వాత బాలయ్య సైతం ఇంత వివరంగా నువ్వు చెప్పిన తర్వాత కూడా నిన్ను ఎవరైనా ఈ విషయంలో విమర్శిస్తే ఊర కుక్కలతో సమానమని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. తాజాగా చిరంజీవి కొత్త ఏడాది సందర్భంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు.
అందులో పవన్ కళ్యాణ్ పై విమర్శలు మీకు ఎలా అనిపిస్తాయని ప్రశ్నించినప్పుడు చిరంజీవి చాలా బాధగా రియాక్ట్ అయ్యాడు. మితిమీరి వాడిని నానా మాటలు అంటున్నప్పుడు బాధ కలుగుతుంది. అవన్నీ తిట్టిన వారు మరలా నా దగ్గరకు వచ్చి మంచిగా ఉంటారు. నన్ను మచ్చిక చేసుకుంటూ ఉంటారు.
నా దగ్గరకు వచ్చి పెళ్లిళ్లు , పేరంటాలు, శుభకార్యాలకు పిలుస్తుంటారు. నా తమ్ముడిని అన్ని మాటలు అన్న వారిని కలవడం, వారితో కలిసి నవ్వుతూ మాట్లాడటం, వారి వేడుకలకు హాజరవ్వడం చాలా బాధగా ఉంటుంది.. అని చిరు సమాధానం ఇచ్చారు.
పవన్ పై అయినదానికి, కానిదానికి మితిమీరి విమర్శించిన వైసీపీ బ్యాచ్ సినీరంగంలో కూడా ఉంది. పోసాని కృష్ణ మురళి, 30 ఇయర్స్ పృథ్వీ లాంటి వారు ఇలాగే రెచ్చిపోయారు. 30 ఇయర్స్ పృథ్వీకి జ్ఞానోదయం అయింది. పోసాని సంగతి దేవుడికి ఎరుక..? ఇలా పవన్ ను వ్యక్తిగతంగా విమర్శించే ఈ వైసీపీ బ్యాచ్ లో రోజా కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది.
ఇంతెందుకు ఏకంగా సీఎం జగన్ తన స్థాయిని మర్చిపోయి పవన్ వైవాహిక జీవితంపై ఒకనాడు పలు వ్యాఖ్యలు చేశాడు. పదే పదే అదే విషయాన్ని ప్రస్తావించి పవన్‌ని మానసికంగా దెబ్బకొట్టే ప్రయత్నాలు చేశారు. వారి గురించే ఇండైరెక్ట్ గా చిరంజీవి కామెంట్స్ చేశారని అర్థమవుతుంది.
ఈ మధ్య సినీ రంగ సమస్యలపై సినీ పెద్దలతో కలిసి చిరంజీవి జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. నాడు చిరంజీవికి జగన్ ఏ మాత్రం గౌరవం ఇవ్వలేదు. మెగాస్టార్ చేతనే రెండు చేతులు జోడించేలా చేశాడు. దానిపై పవన్ ఆ తర్వాత ఘాటుగా విమర్శలు చేశాడు కూడా.
ఆ తరువాత మరలా జగన్ తన ఇంట్లో జరిగిన పలు వేడుకలకు చిరంజీవి దంపతులను సైతం ఆహ్వానించారు. ఇలా డబల్ గేమ్ ఆడటం వైసీపీ బ్యాచ్ కి మొదటి నుంచి ఉన్న అలవాటు. చిరంజీవి తన తమ్మునిపై విమర్శలు గుప్పించిన వారి ఇళ్లలో వివాహాలకు, శుభకార్యాలకు కూడా హాజరవుతూ ఉండడం చూస్తుంటే చిరు ఇలా మాట్లాడింది వైసీపీ పెయిడ్ బ్యాచ్ గురించేనని స్పష్టంగా అర్థం అవుతుంది.