Site icon vidhaatha

NTR | జూనియర్ ఢిల్లీ వెళ్తాడా ? తాత పేరిట నాణెం విడుదలకు చంద్రబాబు పిలుపు

NTR |

విధాత: ఢిల్లీలో ఈనెల 28న మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్మారకార్థం కేంద్రం వంద రూపాయల నాణేన్ని విడుదల చేస్తున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లేందుకు చంద్రబాబు, నందమూరి కుటుంబాలు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆ ప్రోగ్రాంకు వెళ్ళడానికి వాళ్లంతా పిలుపు చేసుకుంటున్నారు. ఏ మేరకు జూనియర్ ఎన్టీఆర్ కు సైతం పిలుపువచ్చింది.. ఢిల్లీ కానీ అయన వెళితే అక్కడ చంద్రబాబుతో భేటీ అయ్యి ఆయన్ను పార్టీ కోసం వినియోగించుకుంటారు అని అంటున్నారు.

కానీ అయన వస్తారా? రారా అన్నది తెలియడం లేదు. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాలకు ఆయనకు పిలుపు రానేలేదు. దీనిపట్ల అయన అభిమానులు అప్పట్లో గుర్రుమన్నారు. ఐతే జూనియర్ కు ప్రజల్లో ఉన్న ఆదరణ గురించి చంద్రబాబుకు తెలుసు.. కానీ ఆయన్ను నేరుగా రమ్మని పిలిచే ధైర్యం లేదు.

వాస్తవానికి జూనియర్ అభిమానులు ఆంధ్రాలో తరచూ చంద్రబాబును, లోకేశ్ ను ఇరిటేట్ చేస్తూనే ఉన్నారు. వారి పాదయాత్రలు, మీటింగుల్లో జూనియర్ ఫ్లెక్సీలు ప్రదర్శించి నినాదాలు చేస్తూ లోకేశ్ ను ఇబ్బంది పెడుతున్నారు. ఆమధ్య గుడివాడలో ఇలాగె జూనియర్ అభిమానులు జై హరికృష్ణ, జై జూనియర్ అని చేసిన నినాదాల పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఈ క్రమంలో ఇప్పుడు 28న రాష్ట్రపతి భవన్ లో ఎన్టీఆర్ పేరిట వందరూపాయల నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేస్తారు. దీనికి చంద్రబాబు ఒకరోజు ముందే ఢిల్లీ వెళ్తున్నారు. సరిగ్గా 28న చంద్రబాబు, నందమూరి కుటుంబీకులు పురందేశ్వరి వెళ్తున్నారు.

ఈ సందర్భంగా జూనియర్ కూడా వెళ్తే ఆయన్ను తమ ఫోల్డర్లోకి తీసుకుని ఎన్నికల్లో వినియోగించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. అదే తరుణంలో చంద్రబాబుకు మరోసారి బలవడానికి అయన సిద్ధంగా ఉంటారా అని మరో సందేహం కలుగుతోంది.

Exit mobile version