విధాత: పలు అభివృద్ధి కార్యక్రమాల శంఖుస్థాపనల నిమిత్తం ఈనెల 11న విశాఖ వస్తున్న ప్రధాని కోసం ఏపీ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. వేలాది మందితో ఆంధ్ర యూనివర్సిటీలో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పలువురు బీజేపీ నాయకులు పాల్గొంటారు.
ఇదంతా ఒకే గానీ ఆంధ్రాలో బీజేపీతో అధికారికంగా మిత్రుత్వంలో ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ సభలో మోడీతో బాటు పాల్గొంటారా.. లేదా తప్పించుకుని బీజేపీతో తెగదెంపులు చేసుకుంటారా అన్నది తెలియడం లేదు. ఇదే విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును అడిగినా ఆయన కూడా ఏదీ చెప్పలేకపోతున్నారు. మోడీ విశాఖలో విశాఖలో రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు,పెట్రోల్ రిఫైనరీ విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
ఈ ప్రధాని పర్యటన కార్యక్రమానికి, ఏపీలో ఎన్డీయేకు ఉన్న ఏకైక భాగస్వామ్య పార్టీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆహ్వానం ఉంటుందా? ఉండదా? అనే మొదలైంది. తనకు ప్రధాని మోడీ చాలా చాలా క్లోజ్ అని పవన్ కల్యాణ్ చెబుతూ ఉంటారు. గతంలో.. భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు కూడా పవన్ రాలేదు. చిరంజీవి మాత్రమే వచ్చారు.
ఇదిలా ఉండగా పవన్‌ను బీజేపీ అగ్రనాయకత్వం ఎన్నడూ పెద్దగా గుర్తించింది లేదు. ఇదిలా ఉండగా పవన్ ఇప్పటికే తాను చంద్రబాబుతో కలిసి ఎన్నికలకు వెళ్తానని హింట్స్ ఇస్తుండగా బీజేపీ రాష్ట్ర నేతలు మాత్రం పవన్ తమ వాడే అని చెబుతూ వస్తున్నారు. పవన్ కూడా బీజేపీ.. టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలన్న కోరికతో ఉన్నారు. ఈ తరుణంలో పవన్‌ను బీజేపీ ఎలా గుర్తిస్తుందో చూడాలి. ఇటు జనసైనికుల్లో కూడా పవన్ పట్ల బీజేపీ ఎలా స్పందిస్తుందో అన్న ఆత్రుత నెలకొంది.