Site icon vidhaatha

కంటోన్మెంట్‌కు ఉప ఎన్నిక? ఉంటుందా.. ఉండదా?

విధాత: సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న ఆకస్మిక మృతి నేపథ్యంలో ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తారా? అన్న చర్చ జోరుగా జరుగుతున్నది. సాధారణంగా సిట్టింగ్‌ సభ్యుడు చనిపోతే ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తారు. ఆ స్థానాన్ని ఖాళీ అయిన ఆరు నెలల లోపు భర్తీ చేయాల్సి ఉంటుంది.

అయితే.. సదరు సభ్యుడి పదవీకాలం ఏడాదిలోపే ఉన్నా ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించలేమని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపుల అనంతరం ఎన్నికల సంఘం ధృవీకరించినా ఉప ఎన్నిక రాదని ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి.

ఈ ఏడాది డిసెంబర్‌లోపు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. జనవరి నాటికి కొత్త ప్రభుత్వం కొలువు దీరాల్సి ఉన్నది. కనుక ఈ సమయంలో కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు లేవని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

Exit mobile version