బైక్‌పై కూర్చోనివ్వ‌లేద‌ని.. మ‌ద్యం మ‌త్తులో క‌డుపులో త‌న్నిన యువ‌తి.. వీడియో

ఓ యువ‌తి పీక‌ల దాకా మ‌ద్యం సేవించి, హంగామా సృష్టించింది. బైక్‌పై కూర్చోనివ్వ‌లేద‌ని ఓ యువ‌కుడిపై దాడి చేసింది. అత‌ని గ‌ల్లా ప‌ట్టుకుని చెంప ఛెల్లుమ‌నిపించింది.

  • Publish Date - March 2, 2024 / 08:02 AM IST

విధాత: ఓ యువ‌తి పీక‌ల దాకా మ‌ద్యం సేవించి, హంగామా సృష్టించింది. బైక్‌పై కూర్చోనివ్వ‌లేద‌ని ఓ యువ‌కుడిపై దాడి చేసింది. అత‌ని గ‌ల్లా ప‌ట్టుకుని చెంప ఛెల్లుమ‌నిపించింది. అంతేకాదు.. అత‌ని క‌డుపులో ప‌దేప‌దే త‌న్నింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.


గుజ‌రాత్‌లోని వ‌డోద‌ర సిటీలో ఓ ర‌హ‌దారి వాహ‌నదారుల‌తో ర‌ద్దీగా ఉంది. సాయాజీ గంజ్ ఏరియాలో ఓ యువ‌కుడు త‌న బైక్‌ను రోడ్డు ప‌క్క‌కు ఆపి నిల్చున్నాడు. మ‌ద్యం మ‌త్తులో ఉన్న ఓ యువ‌తి అక్క‌డికి చేరుకుంది. ఇక అత‌ని బైక్‌పై కూర్చునేందుకు య‌త్నించ‌గా, యువ‌కుడు అడ్డుకున్నాడు. దీంతో ఆమెలో కోపం ర‌గిలిపోయింది. యువ‌కుడి కాళ్ల‌తో తంతూ, చెంప ఛెల్లుమ‌నిపించింది. గ‌ల్లా ప‌ట్టుకుని అంద‌రి ముందు అవ‌మాన ప‌రిచింది. చివ‌ర‌కు అత‌ని బైక్‌ను నేల‌పై ప‌డేసింది. ఆ త‌ర్వాత ఓ బండ రాయిని బైక్‌పై వేసేందుకు య‌త్నించ‌గా, అత‌ను అడ్డుకున్నాడు.


ఇక ట్రాఫిక్ పోలీసులు అక్క‌డికి చేరుకునే లోపే ఆ యువ‌తి అక్క‌డ్నుంచి జారుకుంది. ఈ ఘ‌ట‌న‌పై బాధిత యువ‌కుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Latest News