Site icon vidhaatha

Women’s Day | మహిళా దినోత్సవ కానుక.. మహిళలకు BOB బంపర్‌ ఆఫర్స్‌

Women’s Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు వివిధ సంస్థలు ఆఫర్‌లు అందజేస్తున్నాయి. అందులో భాగంగా ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ‘బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)’ మహిళా ఖాతాదారుల కోసం బంపర్‌ ఆఫర్స్‌ ప్రకటించింది. బీవోబీ మహిళా శక్తి సేవింగ్‌ ఖాతా లేదంటే బీవోబీ ఉమెన్ పవర్ కరెంట్ ఖాతాను జూన్ 30లోగా తెరిచి, డిసెంబరు 31 వరకు ఆఫర్‌లతో రుణాలు పొందే అవకాశం కల్పిస్తున్నట్లు ఆ బ్యాంకు తెలిపింది.

ఈ ఖాతాలు తెరిచిన మహిళలకు అందించే రిటైల్ రుణాలపై 25 బేసిస్ పాయింట్ల (0.25%) వరకు వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్లు బీవోబీ తెలిపింది. అదేవిధంగా ద్విచక్ర వాహన రుణాలకైతే 0.25% బేసిస్‌ పాయింట్లు, విద్యా రుణాలకైతే 0.15% బేసిస్‌ పాయింట్లు, వాహన, గృహ, తనఖా రుణాలపై 0.1% వడ్డీ రాయితీ ఇవ్వనున్నట్లు బ్యాంకు ప్రకటించింది.

అంతేగాక రిటైల్ రుణాలపై (వ్యక్తిగత రుణాలతో సహా) ప్రాసెసింగ్ రుసుమును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు బీవోబీ తెలిపింది. వార్షిక సురక్షిత డిపాజిట్ లాకర్ ఛార్జీలపై కూడా 50% రాయితీ ఇవ్వనున్నట్లు బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా మహిళా దినోత్సవ కానుకగా మహిళలకు ఒక శుభవార్త తెలియజేసింది. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.100 తగ్గించింది.

Exit mobile version