Site icon vidhaatha

World Cup Tickets | క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌..! మళ్లీ మ్యాచ్‌ టికెట్లను విక్రయించనున్న బీసీసీఐ..!

World Cup Tickets |

స్టేడియంలో వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లను లైవ్‌గా చూడాలనుకునే అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. ఇప్పటికే తొలి దశలో టికెట్ల అమ్మకాలు పూర్తయ్యాయి. అయితే, టికెట్ల విక్రయాలు జరిగిన తీరుపై బీసీసీఐ, బుక్‌మైషోలపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మరో విడుతలో టికెట్ల అమ్మకాలను విక్రయించనున్నట్లు పేర్కొంది. ఈ నెల 8 నుంచి వరల్డ్‌ కప్‌ టికెట్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

తర్వాతి దశలో టికెట్ల విక్రయాలపై అభిమానులకు ముందస్తుగానే సమాచారం అందిస్తామని వెల్లడించింది. నిజానికి దశల వారీగా టికెట్ల అమ్మకాలు ఉంటాయని ఇప్పటి వరకు చెప్పలేదు. తొలిదశలో టికెట్లకు విపరీతమైన డిమాండ్‌ ఉండడం, అందుబాటులోకి ఉండడంతో అమ్ముడైపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వాస్తవానికి సెప్టెంబర్‌ 3వ తేదీతోనే లీగ్‌ దశకు సంబంధించిన టికెట్ల విక్రయాలు పూర్తయ్యాయి.

బీసీసీఐ తాజా ప్రకటనతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌ చాలా ఆలస్యంగా ప్రకటించారు. టోర్నీకి వంద రోజుల ముందు విడుదల చేయడం, ఆ తర్వాత పలు మార్పులు చేయడం కూడా టికెట్ల విక్రయాలు ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం డిమాండ్‌ మేరకు ఆయా రాష్ట్రాల డిమాండ్‌ నేపథ్యంలో మ్యాచ్‌లను అసోసియేషన్లతో మరో దశలో టికెట్ల విక్రయాలు నిర్ణయించినట్లు మళ్లీ వెల్లడించింది.

Exit mobile version