Site icon vidhaatha

మురళీకృష్ణుడి అవతారంలో యాదాద్రి లక్ష్మీ నరసింహుడు


విధాత : యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు శుక్రవారం స్వామివారు శ్రీ మురళీకృష్ణుడి అవతారం అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. యాజ్ఞిక, అర్చక పండిత బృందం బ్రహ్మోత్సవ పర్వాలను పాంచరాత్రగమశాస్త్రానుసారం వైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామివారు మురళీకృష్ణుడి అలంకార సేవలో తన ప్రణవ వేణుగానంతో సమస్త ప్రకృతిని, జీవరాశులను, భక్తులనలు అనుగ్రహిస్తూ తిరుమాఢ వీధుల్లో విహరించారు. అనంతరం పొన్న వాహనంపై విహరించి భక్తులకు కోరికలను తీర్చే అభయప్రధాతగా నిలిచారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధార్మిక, సంగీత, సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు భక్తులను అలరించాయి.


డార్మిటర్‌ హాల్‌కు ఎమ్మెల్యే బీర్ల శంకుస్థాపన

కొండపైన భక్తుల సౌకర్యార్థం డార్మిటరీ హాల్‌, వేసవిలో నీడ షెడ్‌ల నిర్మాణాలకు స్థానిక ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.



Exit mobile version