Site icon vidhaatha

Hanumakonda l హనుమకొండలో యోగా మహోత్సవ్ ప్రారంభం

Yoga Mahotsav begins at Hanumakonda

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్(Arts & Science) కళాశాలలో రామచంద్ర మిషన్, కేంద్ర సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి 5వ తేదీ వరకు నిర్వహించనున్న “యోగ ”(Yog) మహోత్సవం ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న దయాకర్ రావు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ మానసిక, ఆరోగ్య సమస్యల నుండి బయటపడాలంటే ప్రతిరోజు యోగను ఒక దినచర్యగా చేపడితే ఆరోగ్యం పెంపొందు తుందన్నారు. ప్రతి మనిషి ఉరుకుల పరుగుల జీవితాన్ని గడపుతున్నారని అన్నారు. ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయని అన్నారు.

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ యోగ భారతీయ ప్రజలు అతి ప్రాచీన కాలం నుండి ఆచ‌రిస్తున్నారన్నారు.

నిత్యం యోగా చేయ‌డం శ్రేయ‌స్క‌రం..

నిత్య జీవితంలో యోగ ప్రధాన పాత్ర పోషించాలని ప్ర‌ఖ్యాత యోగ గురువు, పద్మ భూషణ్ దాజి (Padma Bhushan Daji) అన్నారు. నిత్యం మనం ఎదుర్కొంటున్న సమస్యలలో శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, కాబట్టి ఆరోగ్యపరంగా సమస్యలు తలెత్తుతున్నాయి అని అన్నారు. యోగాను నిత్యం మన ఇంట్లో చేపట్టడం శ్రేయస్కరమని ఆయన అన్నారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ప్ర‌ఖ్యాత బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీ చంద్, మేయర్ సుధారాణి, సీపీ రంగనాధ్, హనుమకొండ కలెక్టర్ సిక్త పట్నాయక్, వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి, కమిషనర్ ప్రావీణ్య, డిఆర్డిఏ పిడి శ్రీనివాస్, కేయు వీసీ ఆచార్య రమేష్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఐలయ్య, పలువురు ఉన్నత అధికారులు, విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరు ఐయ్యారు. శిక్ష‌ణ‌ నిపుణులు అందరి చేత యోగ నేర్పించారు.

Exit mobile version