You Tube CEO | యూట్యూబ్ సీఈవో పదవికి సుసాన్ వోజ్‌కికీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఇంక్ గురువారం ప్రకటించింది. తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నట్లు వోజ్‌కికీ ఓ బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొంది. ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టాలని ఆమె కోరుకుంటున్నారు. అయితే, ప్రక్రియ పూర్తయ్యే వరకు పదవిలో కొనసాగనున్నట్లు తెలిపారు. గూగుల్, దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఇంక్ కోసం సలహాదారు పాత్రలో కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. వోజ్‌కికీ స్థానంలో భారతీయుడు నీల్ మోహన్‌ను సీఈవోగా నియామకమయ్యారు.
యూట్యూబ్ యాజమాన్యం ఇండియన్-అమెరికన్ అయిన నీల్ మోహన్‌ను కొత్త సీఈవోగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం నీల్ మోహన్ యూట్యూబ్‌లోనే చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా.. సుసాన్ వోజికికీ గత 25 సంవత్సరాలుగా గూగుల్ మాతృసంస్థలో పని చేస్తున్నారు. 2014లో యూట్యూబ్ సీఈవో బాధ్యతలు చేపట్టారు. తొమ్మిది సంవత్సరాల తర్వాత పదవి నుంచి వైదొలిగారు. గూగుల్‌లో ఎక్కువ కాలం పని చేసిన ఉద్యోగుల్లోనూ ఆమె ఒకరు. ఆమె కంపెనీలో తొలుత మార్కెటింగ్ మేనేజర్‌గా పని చేరారు. ఇదిలా ఉండగా.. నీల్ మోహన్ 2008లో గూగుల్‌లో చేరారు. 2015లో యూట్యూబ్‌లో బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. ప్రపంచ దిగ్గజ టెక్నాలజీ కంపెనీల్లో భారతీయుల హవా కొనసాగుతున్నది. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఈసీవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదేళ్ల, అడోబ్ సీఈవోగా శంతనునారాయణ్ కొనసాగుతున్నారు.