Site icon vidhaatha

YS Jagan | విజయదశమి నుంచి విశాఖలో జగన్.. తాజా కేబినెట్ భేటీలో ప్రకటన!

Ys Jagan |

ఇప్పటికే చాలా సార్లు అనుకున్నదే.. జగన్ విశాఖ వచ్చేస్తున్నారు. అదే ఇక ఆంధ్రప్రదేశ్‌కు పాలనా రాజధాని.. ఇదిగో జగన్ వస్తున్నారు.. అదిగో.. అంటూ ఇన్నాళ్లుగా చెబుతూ వస్తున్నా.. ఇప్పటికైతే వాస్తవరూపం దాల్చలేదు. దీనికి పాలనాపరమైన చిక్కులతోబాటు కోర్టులు సైతం పలు సందేహాలు వ్యక్తం చేస్తూ సీఎం జగన్ను విశాఖ రానివ్వలేదు.

అయితే ఈ దసరా నుంచి జగన్ విశాఖలోనే ఉంటున్నట్లు, దానికి ఆయన ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈరోజు కేబినెట్ భేటీ నిర్వహించగా ఈ సందర్భంగా సీఎం జగన్ తాను విశాఖకు మకాం మార్చనున్న అంశాన్ని ప్రకటించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే . విశాఖలో రుషికొండ వద్ద ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ నిర్మిస్తున్నారు. ఇక ఆయన విశాఖ రావడమే తరువాయి అంటున్నారు. వాస్తవానికి మూడు రాజధానుల విషయం మీద కోర్టుల్లో
వివాదం ఉంది. ఈ అంశాన్ని వైయస్సార్ కాంగ్రెస్ వికేంద్రీకరణ పాలన అంటుండగా తెదేపాతో సహా ప్రతిపక్షాలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి.

అదే విధంగా చూస్తే అమరావతి రాజధని మీద హై కోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ లో సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఇపుడు కేసు సుప్రీం కోర్టులో ఉంది. కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా జగన్ ఇక విశాఖ వెళ్లేందుకు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. జగన్ సీఎం క్యాంప్ ఆఫీసు విశాఖకు మార్చడం పెద్ద సమస్య కాదని, రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పాలన సాగించవచ్చు అని అంటున్నారు.

Exit mobile version