Site icon vidhaatha

YS Sharmila: రేవంత్ రెడ్డి ఊసరవెల్లి.. భగ్గుమన్న వైఎస్.షర్మిల

విధాత: అధికారం నిలుపుకునేందుకు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే పీసీసీ చీఫ్ ఏ.రేవంత్ రెడ్డి(PCC chief Revanth Reddy)కి మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి(YS. Rajasekhar Reddy) గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) ట్విట్ట‌ర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్ఆర్ పాలన తెలంగాణలో తెస్తానని ఓటుకు నోటు(Note for vote) దొంగ కొత్త జపం చేయడం హస్యాస్పదం అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) విసిరిన ఎంగిలి మెతుకుల కోసం ఆనాడు వైఎస్ఆర్ ను ఆజన్మ శత్రువు అన్నది ఈ దొంగ కాదా. వైఎస్ఆర్ మరణిస్తే పావురాల గుట్టలో పావురం అంటూ అవహేలన చేసిన ఈ దగాకోరు కాదా అని షర్మిల భగ్గుమన్నారు.

పులితోలు కప్పుకున్నంత మాత్రమా నక్క పులి కాదని, అద్దెకు తెచ్చుకున్న ఉద్దెర నాయకుడు రేవంత్ అని మండిపడ్డారు. భారీ కాన్వాయ్ తో కారులో తిరుగూ ఆటవిడుపులా పాదయాత్ర చేస్తూ కొత్త పేరు పెట్టుకున్నారు. ఇలాంటి ప్రబుద్ధుడు ఊరూరా తిరిగి పొర్లు దండాలు పెట్టినా జనం నమ్మరని షర్మిల స్పష్టం చేశారు.

ఓటుకు నోటు దొంగను జనాలు నమ్మడం లేదని, వైఎస్ఆర్ పేరును వాడుకుంటున్న రేవంత్ కు అభిమానులే బుద్ది చెప్తారని ఆమె హెచ్చరించారు. వైఎస్ఆర్ సంక్షేమ పాలన కోసం పుట్టిన ఏకైక పార్టీ తనదేనని, ఆయన ఆశయ సాధన కోసం 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసింది తనే అని షర్మిల ట్వీట్ చేశారు.

Exit mobile version