Site icon vidhaatha

సీఎం జగన్‌ను కలిసిన టీటీడీ చైర్మన్

విధాత‌: సీఎం జగన్‌ను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కలిశారు. బుధవారం ఉదయం శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో జగన్‌ ను కలిసిన టీటీడీ చైర్మన్ స్వామివారి ప్రసాదాలు, శేష వస్త్రాలను సీఎంకు అందజేశారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరై, రాష్ట్ర ప్రజల తరపున పట్టువస్త్రాలు సమర్పించాల్సిందిగా ముఖ్యమంత్రికి టీటీడీ చైర్మన్ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ నెల 27 నుంచి అక్టోబరు 5 వరకు శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. కార్య‌క్ర‌మంలో టీటీడీ చైర్మన్‌తో పాటు టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Exit mobile version