Site icon vidhaatha

Horoscope | ఏప్రిల్ 9, బుధ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఊహించ‌ని ధ‌న‌లాభం..!

Rasi Phalalu |

జ్యోతిషం, రాశి ఫ‌లాలు అంటే మ‌న తెలుగు వారికి ఏండ్ల త‌ర‌బ‌డి చెర‌గ‌ని నమ్మకం ఉంది. లేచిన స‌మ‌యం నుంచి తిరిగి నిద్రించే వ‌ర‌కు మంచే జరగాలని కోరుకుంటాం.అందుకే ప్ర‌తీ రోజూ మ‌న రాశి ఫ‌లాల గురించి, ఇంట్లో వారి రాశుల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ మ‌న ప‌నులు నిర్వ‌హిస్తూ ఉంటాం. దాని ప్ర‌కార‌మే న‌డుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవ‌గానే మొద‌ట చాలామంది వెతికేది వారికి ఆ రోజు ఎలా ఉండ‌బోతుంద‌నే. అలాంటి వారంద‌రి కోసం వారి పేర్ల మీద ఈ రోజు (బుధ‌వారం, ఏప్రిల్ 09) న‌ మీరాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మేషం

మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభసమయం నడుస్తోంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. విశేషమైన ఆర్థిక లాభాలు అందుకుంటారు. ప్రభుత్వ రంగంలో లేదా వైద్య రంగంలో ఉన్నవారికి ఈ రోజు చాలా అదృష్టవంతమైన రోజు.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మనోబలంతో అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగులు తమ పనితీరుతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఆర్థికంగా అత్యంత ఫలదాయకమైన రోజు. ఊహించని ధనలాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయి.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సమస్యల నుంచి బయటపడతారు. కలిసి వచ్చే కాలం మొదలైంది. అన్ని రంగాల వారు శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కలిగి ఉంటే మంచిది. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు లేకపోవడంతో నిరాశ చెందుతారు. ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ కలహాలు రాకుండా కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. గొప్ప ఆత్మవిశ్వాసంతో క్లిష్టమైన పనులు కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యాపారులు మంచి లాభాలు అందుకుంటారు. ప్రయాణాలలో ఊహించని శుభ పరిణామాలు ఎదురవుతాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహా మేరకు నడుచుకుంటే మంచిది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ధైర్య సాహసాలతో సమస్యలకు ముగింపు పలుకుతారు. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. ఓ శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది.

తుల

తులారాశి వారికి ఈ రోజు చాలా బాగుంటుంది. కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. విశేషమైన ధన లాభాలు ఉంటాయి.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు అదృష్టకరంగా ఉంటుంది. దైవ దర్శనాలు, ఆర్థిక ప్రయోజనాలు గొప్ప ఆనందం కలిగిస్తాయి. మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన మనస్సుతో సంతోషంగా ఉంటారు. చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయం పెరగడం సంతృప్తినిస్తుంది.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. తీవ్రమైన అనారోగ్య సమస్యల కారణంగా ఏ పనిపైనా ఆసక్తి లేకుండా ఉంటారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలు పెరుగుతాయి. సమయ స్ఫూర్తితో వ్యవహరిస్తే సమస్యల నుంచి బయట పడవచ్చు. వ్యాపారంలో పోటీ పెరుగుతుంది. కొన్ని ఘటనలు బాధ కలిగిస్తాయి. ముందుచూపు లేకపోవడంతో ఖర్చులు పెరుగుతాయి.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. వృత్తి పరంగా నూతన అవకాశాలు అందుకుంటారు. ఏ అవకాశాన్ని వదులుకోకండి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. ఆర్థిక అభివృద్ధికి సంబంధించి శుభవార్త వింటారు. చేపట్టిన పనుల్లో అనుకూలత ఉంటుంది.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు ఫలదాయకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచన ఉంది. వృధా ఖర్చులు నివారించండి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉన్నత స్థానంలో నిలవాలనుకుంటే సృజనాత్మకంగా వ్యవహరించండి. కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటే ఉన్నత స్థానానికి ఎదుగుతారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. ఖర్చులు తగ్గించుకోండి.

Exit mobile version