ఐదువేల లోపు ఓట్లతో 15 సీట్లు తారుమారు … అక్కడ మెజారిటీ 48 ఓట్లే

దేశంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 15 లోక్‌సభ నియోజక వర్గాల్లో అభ్యర్థులు అతితక్కువ మెజారిటీలతో బయటపడ్డారు. ముంబై వాయువ్య నియోజకవర్గంలో అతితక్కువగా 48 ఓట్ల ఆధిక్యతతో ఏక్‌నాథషిండే నాయకత్వంలోని శివసేన విజయం సాధించింది.

  • Publish Date - June 10, 2024 / 04:44 PM IST

విధాత ప్రత్యేకం-

దేశంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 15 లోక్‌సభ నియోజక వర్గాల్లో అభ్యర్థులు అతితక్కువ మెజారిటీలతో బయటపడ్డారు. ముంబై వాయువ్య నియోజకవర్గంలో అతితక్కువగా 48 ఓట్ల ఆధిక్యతతో ఏక్‌నాథషిండే నాయకత్వంలోని శివసేన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో తక్కువ మెజారిటీల్లో ఇదే రికార్డు. ఆ తర్వాత కేరళలోని అత్తింగళ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ సమీప సీపీఎం అభ్యర్థిపై 684 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించింది. ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సమీప బీజేడీ అభ్యర్థిపై 1587 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌ రూరల్‌ నియోజకవర్గంలో బీజేపీ సమీప కాంగ్రెస్‌ అభ్యర్థిపై 1615 ఓట్ల ఆధిక్యంతో బయటపడ్డది.

అలాగే చత్తీస్‌గడ్‌లోని కేంకర్‌ నియోజకవర్గంలో బీజేపీ సమీప కాంగ్రెస్‌ అభ్యర్థిపై 1884 ఓట్ల మెజారిటీతో గెలిచింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆరు నియోజకవర్గాల్లో కేవలం ఐదు వేల ఓట్ల లోపు ఆధిక్యతతో పార్టీలు విజయకేతనం ఎగురవేశాయి. బాన్స్‌గాంలో బీజేపీ 3150 ఓట్లతో, దౌరాహ్రాలో ఎస్‌పీ 4449 ఓట్లతో, ఫరూఖాబాద్‌లో బీజేపీ 2678 ఓట్లతో, ఫూల్‌పూర్‌లో బీజేపీ 4332 ఓట్లతో, హమీర్‌పూర్‌లో ఎస్‌పీ 2629 ఓట్లతో, సలీంపూర్‌లో ఎస్‌పీ 3573 ఓట్లతో విజయం సాధించాయి. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో బీజేపీ 4500 ఓట్ల ఆధిక్యంతో గెలిచింది. తమిళనాడులోని విరుధ్‌నగర్‌లో కాంగ్రెస్‌ 4379 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో కాంగ్రెస్‌ సమీప ఆప్‌ అభ్యర్థిపై 3242 ఓట్ల మెజారిటీతో గెలిచింది. మహారాష్ట్రలోని ధూలేలో కాంగ్రెస్‌ ఆధిక్యత 3831 ఓట్లు మాత్రమే. ఐదు వేల లోపు ఆధిక్యతతో గెల్చుకున్న సీట్లలో ఎన్‌డీఏవి ఎనిమిది కాగా, ఇండియా కూటమివి 7 సీట్లు ఉన్నాయి.

Latest News