The C-Section Surge in India | ఇండియాలో పెరిగిపోతున్న శస్త్రచికిత్స ప్రసవాలు

భారత్‌లో సిజేరియన్ ప్రసవాలు 2016లో 17.2% నుంచి 2024 నాటికి **21.5%కు పెరిగాయి. కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ శాతం ఎక్కువగా ఉంది. సహజ ప్రసవాలే మేలు అని నిపుణులు చెబుతున్నారు.

The C-Section Surge in India

దేశంలో శస్త్రచికిత్స ద్వారా ప్రసవాలు (సిజేరియన్ లేదా సి-సెక్షన్) చేయడం పెరిగిపోతోంది. దీని వల్ల మహిళల ఆరోగ్యాలపై కూడా ప్రభావం చూపిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇండియాలో 21 శాతం పెరిగిన సిజేరియన్ ప్రసవాలు

భారత్ లో సి-సెక్షన్ పెరుగుదలపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2016లో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 విడుదల చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2016 నుంచి 2024 వరకు సిజేరియన్ ప్రసవాలు పెరిగినట్టు ఈ నివేదిక చెబుతోంది. 2016లో 17.2 శాతంగా ఉన్న సిజేరియన్ ప్రసవాలు 2024 నాటికి 21.5 శాతానికి చేరుకున్నాయి.2005 నుంచి 2016లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో సహజ ప్రసవాల కంటే సిజేరియన్ డెలీవరీలు ఎక్కువగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శస్ర్తచికిత్స ద్వారా ప్రసవాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఇవి మరింత పెరిగాయి. ఈ రాష్ట్రాల్లో ఇది 43.4 శాతానికి చేరుకుంది. దేశంలో సి-సెక్షన్ ప్రసవాలు 42.4 శాతానికి చేరాయి. అయితే దేశ సగటు 21.5 శాతం. జిల్లాలు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సహజ ప్రసవాల కంటే శస్త్రచికిత్సల ద్వారా జరిగే ప్రసవాలు 50-60 శాతానికి చేరుకున్నాయి.

శస్త్రచికిత్స ద్వారా ప్రసవాలు ఎప్పుడు చేయాలి?

సహజ ప్రసవాలే మేలు చేస్తాయనేది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం.అత్యవసర పరిస్థితుల్లోనే సిజేరియన్ వైపు వెళ్లాలనేది వైద్యులు సూచిస్తున్నారు. సహజ ప్రసవానికి ఆటంకం ఏర్పడిన సందర్భంలో శస్త్రచికిత్స ద్వారా తల్లీ,బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు సిజేరియన్ చేస్తారు. కానీ, ప్రస్తుతం అవసరం ఉన్నా లేకున్నా సిజేరియన్ వైపే వెళ్లే పరిస్థితి ఉందనేది ఈ రిపోర్టులో ఉన్న గణాంకాలు చెబుతున్నాయి.ప్రైవేట్ ఆసుపత్రులు శస్త్రచికిత్స ద్వారా డెలివరీలకు ప్రాధాన్యత ఇస్తాయనే విమర్శలున్నాయి. ముహుర్తం ప్రకారం బిడ్డకు జన్మనివ్వాలనే పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి. అలాంటి పరిస్థితులు ఉన్న సమయంలో సిజేరియన్ ప్రసవాలు పెరిగాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్నిఅసెంబ్లీలో ప్రకటించారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందన్నారు.

ఒక్కసారి సిజేరియన్ జరిగితే…..

ఒక్కసారి సిజేరియన్ డెలివరీ జరిగితే భవిష్యత్తులో సిజేరియన్ ప్రసవాలు తప్పనిసరిగా మారే అవకాశం ఉందనేది నిపుణుల మాట. తొలిసారి సహజ ప్రసవం సమయంలో నొప్పికి భయపడి కొందరు సిజేరియన్ వైపు ఆసక్తి చూపుతుంటారని వైద్యులు చెబుతున్నారు. దీనికి తోడు ముహుర్తాల ప్రకారం డెలీవరీ చేసుకునే వెసులుబాటు సిజేరియన్ ప్రసవాల్లో ఉంది. ఇది కూడా ఈ రకమైన ప్రసవాల వైపు మొగ్గు చూపుతున్నారు. శస్త్రచికిత్స ద్వారా రక్తస్రావం, అనస్తీషియా ద్వారా సమస్యలు లేకపోలేదు.

శస్త్రచికిత్స ప్రసవాలపై తప్పుడు ప్రచారం

శస్త్రచికిత్స ప్రసవాలు సురక్షితమైనవనే తప్పుడు అభిప్రాయం ఉంది. సిజేరియన్ ప్రసవాలు ఎక్కువైతే దాని ప్రభావంతో నష్టాలు ఎక్కువ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.సిజేరియన్ల వల్ల తల్లీ, పిల్లల మరణాలను తగ్గించవచ్చని సూచిస్తున్నాయి.సహజ ప్రసవం, సిజేరియన్ ప్రసవాల గురించి ముందే మహిళలకు వివరించాలి. దేనివల్ల లాభాలు, నష్టాలు వివరించాలి.