Domestic Helper | రూ. 10 ల‌క్ష‌ల లోన్‌తో.. రూ. 60 ల‌క్ష‌ల ఫ్లాట్ కొన్న ప‌ని మ‌నిషి..! షాకైన ఓన‌ర్

Domestic Helper | ఓ ప‌ని మ‌నిషి( Domestic Helper ) కేవ‌లం రూ. 10 ల‌క్ష‌ల లోన్‌తో రూ. 60 ల‌క్ష‌ల విలువ చేసే ఫ్లాట్( Flat ) కొనుగోలు చేయ‌డం ఏంట‌ని మీకు అనుమానం రావొచ్చు. కానీ ఇది అక్ష‌రాల నిజం. చెమ‌టోడ్చి క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బుతో 3BHK ఫ్లాట్‌ను కొనుగోలు చేసిన ఓ ప‌నిమనిషి విజ‌య‌గాథ ఇది.

Domestic Helper | ఇండ్ల‌లో ప‌ని చేసే ప‌ని మ‌న‌షుల‌ను(Domestic Helpers ) చాలా మంది త‌క్కువ అంచ‌నా వేస్తుంటారు. అస‌లు వారిని ఓ మ‌నిషి లాగా చూడ‌నే చూడరు. మోపెడంత ప‌ని చేయించుకుని.. చివ‌ర‌కు వారిని ఇంటి ఓన‌ర్లు( House Owners ) ఈస‌డించుకుంటారు. వారి ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌తీసేలా య‌జ‌మానులు ప్ర‌వ‌ర్తిస్తుంటారు. కానీ ఓ ప‌ని మ‌నిషి( Domestic Helper ) మాత్రం ఓ ఇంటి ఓన‌ర్‌కు షాకిచ్చింది. నేను మీ కంటే ఏం త‌క్కువ కాద‌ని నిరూపించింది. ఇండ్ల‌లో ప‌ని చేసినంత మాత్రాన‌.. మేం ఇండ్లు కొనుగోలు చేయొద్దా..? ఖ‌రీదైనా ఇండ్ల‌లో నివాసం ఉండొద్దా..? అనే ప్ర‌శ్న‌ల‌కు ఆ ప‌ని మ‌నిషి స‌మాధానం ఇచ్చింది. మ‌రి ఆ ప‌ని మ‌నిషి గురించి తెలుసుకోవాలంటే గుజ‌రాత్‌( Gujarat )లోని సూర‌త్( Surat ) వెళ్లాల్సిందే.

సూర‌త్‌కు చెందిన ఓ మ‌హిళ‌.. ఇండ్ల‌లో ప‌ని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. రెక్కాడితే కానీ డొక్కాడ‌ని ఆమె ప్ర‌తి రూపాయిని పోగు చేసుకుంది. ఆత్మ‌గౌర‌వంతో బ‌త‌కాల‌నే ఉద్దేశంతో.. ఓ ఇంటిని కొనుగోలు చేసింది. ఆ ఇంటి ఖ‌రీదు అక్ష‌రాల 60 ల‌క్ష‌ల రూపాయాలు. ఈ ఫ్లాట్ 3BHK అన్నమాట‌. ఇక ఫ‌ర్నీచ‌ర్ కోసం రూ. 4 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టింది. రూ. 60 ల‌క్ష‌లు పెట్టి కొనుగోలు చేసిన ఆ ప‌ని మ‌నిషి కేవ‌లం రూ. 10 ల‌క్ష‌లు మాత్ర‌మే బ్యాంకు నుంచి లోన్ తీసుకుంది. ఈ విష‌యాల‌న్నీ తాను ప‌ని చేస్తున్న ఇంటి య‌జ‌మానికి చెప్ప‌డంతో ఆ ఓన‌ర్ షాకైంది. ఇండ్ల‌లో ప‌ని చేస్తూ బాగానే పైస‌లు పోగేసుకుని ఇల్లు కొనుగోలు చేశావ‌ని ఓన‌ర్ కితాబిచ్చింది. ఇంకా ఆస్తులు ఏం ఉన్నాయ‌ని ప‌ని మ‌నిషిని ఆమె అడ‌గ్గా.. సూర‌త్‌కు స‌మీపంలోని వెలాంజ‌ గ్రామంలో రెండు అంత‌స్తుల భ‌వ‌నం ఉంద‌ని తెలిపింది. ఒక షాపు కూడా ఉంద‌ని చెప్పింది. ఇవ‌న్నీ కిరాయికి ఇచ్చాన‌ని చెప్ప‌డంతో.. త‌న నోటి నుంచి మాట రాలేద‌ని య‌జ‌మాని పేర్కొంది.

ఈ విష‌యాన్ని ఇంటి య‌జ‌మాని న‌ళిని త‌న ఎక్స్ ఖాతాలో షేర్ చేసుకుంది. కొన్ని గంట‌ల్లోనే నెటిజ‌న్లు విప‌రీతంగా స్పందించారు. పన్ను కట్టకుండా దాచిన డబ్బుల మ్యాజిక్ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. దానికి నళిని.. డబ్బులను వృథా ఖర్చులు చేయకుండా.. స్మార్ట్‌గా పొదుపు చేయడం ద్వారా జరిగిన మ్యాజిక్ అని బదులిచ్చింది. ఇక ఓనర్ కంటే పనిమనిషి రిచ్ అయితే ఎలా ఉంటుందో.. అలాగే ఉంది మీ స్టోరీ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.