king of the jungle | వివాహ విందుకు ఊహించ‌ని అతిథులు.. ఫ్యామిలీతో వ‌చ్చిన జంగిల్ కింగ్‌

గుజ‌రాత్ (Gujarat) జునాగ‌ఢ్ (Junagadh)లో పెళ్లి బృందానికి (wedding ceremony) షాకింగ్‌ అనుభ‌వం ఎదురైంది. వివాహ విందుకు ఊహించ‌ని అతిథులు (king of the jungle) వ‌చ్చారు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ (Viral Video)గా మారింది.

king of the jungle

king of the jungle | గుజ‌రాత్ (Gujarat) జునాగ‌ఢ్ (Junagadh)లో పెళ్లి బృందానికి (wedding ceremony) షాకింగ్‌ అనుభ‌వం ఎదురైంది. వివాహ విందుకు ఊహించ‌ని అతిథులు వ‌చ్చారు. వారిని చూసి అక్క‌డున్న వారు ఒక్క‌సారిగా షాక‌య్యారు. భ‌యంతో వ‌ణికిపోయారు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. జునాగ‌ఢ్‌లో ఇటీవ‌లే ఓ వివాహ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. అతిథులు వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన విందును ఆస్వాదించారు. పెళ్లికి వ‌చ్చిన అతిథులు, బంధువులు అంతా విందు ముగించుకొని ఎవ‌రిదారిన వాళ్లు వెళ్లిపోయారు. ఇంత‌లో అక్క‌డికి ఊహించ‌ని అతిథులు ఎంట్రీ ఇచ్చారు. స‌మీప ప్రాంతం నుంచి అడ‌వికి రారాజైన సింహాలు వ‌చ్చాయి. కాసేపు అటూ ఇటూ రోమింగ్ చేశాయి. వాటికి అవ‌స‌ర‌మైన ఆహారం కోసం వెతికాయి. అయితే, ఆహారం దొర‌క‌క‌పోవ‌డంతో అక్క‌డి నుంచి వెళ్లిపోయాయి.

అక్క‌డే ఉన్న కొంద‌రు సింహాల ఫ్యామిలీని చూసి షాక్ అయ్యారు. ఆ దృశ్యాల‌ను త‌మ కెమెరాల్లో బంధించి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ప్ర‌స్తుతం ఆ వీడియో వైర‌ల్‌గా మారింది. ఇది చూసిన నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు. పెళ్లికి ఊహించ‌ని అతిథులు వ‌చ్చారు. ఫ్యామిలీ మొత్తం విందుకోసం వ‌చ్చింది అంటూ స‌ర‌దాగా కామెంట్లు పెడుతున్నారు.

 

ఇవి కూడా చదవండి :

Bride Showered With Rs 8.5 Crore | వ‌ధువుపై నోట్ల వ‌ర్షం.. నిజంగానే రూ.8.5 కోట్లు ఉప‌యోగించారా..?
Rekha | అనారోగ్యంతో పోరాటం… వ‌చ్చిన సంబంధాలు పోతున్నాయంటూ ఆనందం హీరోయిన్ ఆవేద‌న‌

Latest News