Bride Showered With Rs 8.5 Crore | వధువుపై నోట్ల వర్షం.. నిజంగానే రూ.8.5 కోట్లు ఉపయోగించారా..?
పంజాబ్ (Punjab)లోని తర్న్ తరణ్ (Tarn Taran) జిల్లాలో జరిగిన ఓ వివాహ (Wedding) వేడుకలో వధువుపై నోట్ల వర్షం కురిపించారు. ఇందుకోసం రూ.8.5 కోట్లు (ride showered with Rs 8.5 crore) ఉపయోగించినట్లు వార్తలు వస్తున్నాయి.
Bride showered with Rs 8.5 crore | మన దేశంలో పెళ్లి (Wedding) అంటే ఆ హడావుడే వేరుంటుంది. వేడుకల్లో భాగంగా వధూవరులపై పూల వర్షం కురిపిస్తుంటారు. మరికొందరు ఊరేగింపులో డబ్బును వెదజల్లుతుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వధువుపై ఓ కుటుంబం ఏకంగా కోట్ల రూపాయలను కుమ్మరించింది.
పంజాబ్ (Punjab)లోని తర్న్ తరణ్ (Tarn Taran) జిల్లాలో ఈనెల 14న ఓ వివాహం జరిగింది. ఈ సందర్భంగా వధువుపై కుటుం సభ్యులు పెద్ద మొత్తంలో నోట్ల వర్షం కురిపించారు. వేడుకలో భాగంగా వధువును ఓ చోట నిల్చోబెట్టారు. కొందరు ఆమెపై నోట్లు వెదజల్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. మరోవైపు ఇందుకోసం మొత్తం రూ.8.5 కోట్లు విలువైన కరెన్సీని ఉపయోగించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
ఈ నేపథ్యంలో నోట్లను వెదజల్లడంపై వరుడి ఫ్యామిలీ స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించింది. డ్యాన్స్ చేస్తున్న సమయంలో వధువుపై డబ్బు వెదజల్లిన మాట వాస్తవమేనని అంగీకరించింది. అయితే, అందుకోసం రూ.8.5 కోట్లు వెచ్చించారంటూ వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించింది. అది నిజం కాదని తెలిపింది. అందుకోసం కేవలం రూ.2 లక్షలను మాత్రమే ఉపయోగించినట్లు వివరణ ఇచ్చింది.
వరుడి సోదరుడు సికిందర్ సింగ్ మాట్లాడుతూ.. “నా సోదరుడు ఆస్ట్రేలియాలో ట్రక్కు వ్యాపారం చేస్తున్నాడు. వివాహం ఫిబ్రవరి 14న జరిగింది. వధువుపై నోట్ల వర్షం కురిసింది. కానీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు రూ.8 కోట్లు ఉపయోగించలేదు. ఇందుకోసం రూ.2లక్షలను ఉపయోగించాము. ప్రచారంలో ఉన్న వార్తల్లో నిజం లేదు” అంటూ వివరణ ఇచ్చారు. ఈవెంట్ మేనేజర్ కూడా రూ.8 కోట్ల వార్తలను తోసిపుచ్చారు. డాలర్ నోట్లతో కలిపి మొత్తం రూ.4 లక్షల నగదును ఉపయోగించినట్లు వివరించారు.
Viral video claims ₹8.5 crore showered at a Punjabi wedding in Patti, Tarn Taran. DJ Majha Block owner Nishan Singh clarifies only ₹4 lakh in ₹10 notes was collected. He calls the viral claim fake news.pic.twitter.com/lk9bZrHi0g
— Samar Singh (@singhsamar_) February 18, 2026
ఇవి కూడా చదవండి :
Reels | రీల్స్ కోసం రద్దీ రోడ్డుపై కదులుతున్న వాహనాల డోర్లు తీస్తూ.. బైకర్ ప్రమాదకర స్టంట్స్
Rajya Sabha elections| రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..37స్థానాలకు మార్చి 16న పోలింగ్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram