• Telugu News
  • /National

Rajya Sabha elections| రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..37స్థానాలకు మార్చి 16న పోలింగ్

రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దేశంలోని పది రాష్ట్రాల్లో పదవి కాలం పూర్తికానున్న 37 మంది సభ్యుల స్థానాలకు కొత్తగా ఎన్నికలు నిర్వహించనున్నారు.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Feb 18, 2026, 12:53 pm IST
Read Time: 3 mins
Rajya Sabha elections| రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..37స్థానాలకు మార్చి 16న పోలింగ్

విధాత : రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దేశంలోని పది రాష్ట్రాల్లో పదవి కాలం పూర్తికానున్న 37 మంది సభ్యుల స్థానాలకు కొత్తగా ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణ నుంచి రెండు స్థానాలకు ఎన్నికలు జరుగునున్నాయి. బీఆర్ఎస్ నుంచి కేఆర్. సురేష్ రెడ్డి, కాంగ్రెస్ కు చెందిన అభిషేక్ సింఘ్వీల పదవి కాలం ఏప్రిల్ 9న ముగియనుంది.

రాజ్యసభ స్థానాలు  ఖాళీ అయ్యే రాష్ట్రాలలో మహారాష్ట్ర 7, తమిళనాడు 6, పశ్చిమబెంగాల్ 5, బిహార్ 5, ఒడిశా 4, అస్సాంలో 3, ఛత్తీస్ గఢ్ 2, హర్యానాలో 2, తెలంగాణలో 2, హిమాచల్ ప్రదేశ్ లో 1 స్థానానికి ఎన్నికలు జరుగున్నాయి. ఎన్నికలు జరిగే రాష్టాలలో పార్టీల బలాబలాలు చూస్తే .. రాజ్యసభలో ఎన్డీఏ బలం మరింత పెరుగనుంది.

ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మార్చి 5 వ తేదీ వరకు అభ్యర్థుల నామినేషన్, మార్చి 6న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన.. మార్చి 9 వరకు ఉపసంహరణ గడువు గా నిర్ణయించారు. మార్చి 16న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్.. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి నిర్వహించనున్నారు.