CBS Board Exams | సీబీఎస్‌ఈ పది, ఇంటర్‌ విద్యార్థులకు రెండుసార్లు బోర్డ్‌ ఎగ్జామ్స్‌..!

CBS Board Exams | వచ్చే ఏడాది నుంచి ఇకపై ఏడాదికి రెండుసార్లు పదో తరగతి, ఇంటర్‌ సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలను నిర్వహించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. అయితే, సెమిషన్‌ విధానాన్ని మాత్రం తీసుకువచ్చే ఆలోచన లేదని తెలుస్తుంది. పరీక్షల విషయంపై పాఠశాలల ప్రిన్సిపాల్స్‌తో మే నెలలో చర్చలు జరిపేందుకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేస్తున్నది. అండర్‌ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్లపై ప్రభావం లేకుండా పరీక్షలను నిర్వహించాలని భావిస్తున్నది.

  • Publish Date - April 27, 2024 / 07:27 AM IST

CBS Board Exams | వచ్చే ఏడాది నుంచి ఇకపై ఏడాదికి రెండుసార్లు పదో తరగతి, ఇంటర్‌ సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలను నిర్వహించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. అయితే, సెమిషన్‌ విధానాన్ని మాత్రం తీసుకువచ్చే ఆలోచన లేదని తెలుస్తుంది. పరీక్షల విషయంపై పాఠశాలల ప్రిన్సిపాల్స్‌తో మే నెలలో చర్చలు జరిపేందుకు విద్యాశాఖ సర్వం సిద్ధం చేస్తున్నది. అండర్‌ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్లపై ప్రభావం లేకుండా పరీక్షలను నిర్వహించాలని భావిస్తున్నది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జాతీయ విద్యా విధానం తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేషనల్‌ పాలసీకి అనుగుణంగా సీబీఎస్ఈ బోర్డు పరీక్షల్లో మార్పులు చేయాలని నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ ముసాయిదా కమిటీ గతంలో సూచించింది. ఇస్రో మాజీ చైర్మన్‌ కస్తూరీ రంగన్‌ సారథ్యంలో కమిటీ 11, 12వ తరగతులకు సెమిస్టర్‌ విధానాన్ని వర్తింపజేయాలని సూచించింది. ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద ప్రధాన్‌ గతంలో మీడియాల సమావేశంలో మాట్లాడుతూ.. సీబీఎస్‌ఈ విద్యార్థులు రెండుసార్లు పరీక్షకు హాజరుకావడం తప్పనిసరేమీ కాదన్నారు. ఇంజినీర్‌ కోర్సుల ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ జేఈఈ తరహాలోనే ఏడాదికి రెండు సార్లు పది, ఇంటర్‌ విద్యార్థులు పరీక్షలు రాసే అవకాశం ఉంటుందన్నారు. పరీక్షలకు హాజరవడం విద్యార్థుల ఐచ్ఛికమని ధర్మేంద్ర ప్రధాన్‌ స్పష్టం చేశారు.

Latest News