Delhi Coaching Centre Seized | దేశ రాజధాని ఢిల్లీలోని రాజిందర్‌నగర్‌లోని రౌస్ ఐఏఎస్ స్డీ సర్కిల్‌లో వరద నీరు పోటెత్తిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు విద్యార్థులు మృతి చెందారు. ముగ్గురి ప్రాణాలు బలిగొన్న అనంతరం అధికారులు స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న 13 కోచింగ్ సెంటర్లను సీజ్ చేశారు. పలు కోచింగ్ సెంటర్లపై దాడులు నిర్వహించిన అధికారులు నిబంధనలు ఉల్లంఘించి.. నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లను మూసివేశారు. స్టోర్ రూమ్, పార్కింగ్ ఏరియాలుగా వాడుకోవాల్సిన సెల్లార్‌ను కమర్షియల్‌గా ఉపయోగించుకుంటున్నట్లు అధికారుల దాడుల్లో తేలిందని ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ పేర్కొన్నారు. రాజిందర్‌నగర్‌లోని అన్ని కోచింగ్ సెంటర్లను సీజ్ చేశామని ఆమె వివరించారు. అవసరం అనుకుండా ఢిల్లీ నగర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. రౌస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లోకి అకస్మాత్తుగా వరద నీరు పోటెత్తిన ఘటనలో తెలంగాణలోని మంచిర్యాల అమ్మాయి తానియా సోని (25), ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రేయ యాదవ్ (25), కేరళలోని ఎర్నాకుళానికి చెందిన నవీన్ దల్వైన్ (29) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
Delhi Coaching Centre Seized | దేశ రాజధాని ఢిల్లీలో అధికారుల దాడులు.. 13 సెంటర్లు కోచింగ్ సెంటర్లు సీజ్
