Road accident : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐదుగురు యువకులు కలిసి కారులో వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అన్నమయ్య జిల్లాలోని రామాపురం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు.. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం రాయచోటి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసుల హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం రాయచోటి ఆసుపత్రికి తరలించారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు కడప జిల్లాకు చెందిన అంజి నాయక్ (29), షేక్ అలీమ్ (౩2), జితేంద్ర (22), షేక్ అఫ్రోజ్ (25) గా పోలీసులు గుర్తించారు.