Mumbai | గాలి దుమ్ము, వర్షంతో స్తంభించిన ముంబై

మండిస్తున్న ఎండల నడుమ ముంబైలో పడిన వర్షం వాతావరణాన్ని చల్లబర్చినా.. దానికి ముందు పెద్ద ఎత్తున వచ్చి గాలిదుమ్ముతో నగరం అతలాకుతలమైంది

  • Publish Date - May 13, 2024 / 05:35 PM IST

30 నిమిషాలపాటు విమానాల నిలిపివేత
ఆకస్మికంగా వాతావరణంలో పెను మార్పు

ముంబై: మండిస్తున్న ఎండల నడుమ ముంబైలో పడిన వర్షం వాతావరణాన్ని చల్లబర్చినా.. దానికి ముందు పెద్ద ఎత్తున వచ్చి గాలిదుమ్ముతో నగరం అతలాకుతలమైంది. మధ్యాహ్నం దాదాపు 3 గంటల సమయంలో ముంబైలో వీచిన గాలితో పెద్ద ఎత్తున ధూళి రేగింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ముంబైవాసులు ఊరడిల్లారు.

అయితే.. ఆకస్మిక వాతావరణ మార్పుతో ముంబైలో ట్రాఫిక్‌ పెద్ద ఎత్తున స్తంభించిపోయి, వాహనదారులు నానా ఇక్కట్లకు గురయ్యారు. ఘటక్‌పార్‌, బాంద్రా కుర్లా, ధారావి ప్రాంతాల్లో బలమైన గాలులతోకూడిన వర్షం కురిసింది. పరిస్థితి తీవ్రతతో ముంబై ఎయిర్‌పోర్టులో దాదాపు 30 నిమిషాలపాటు విమానాల రాకపోకలను నిలిపివేశారు.

Latest News