Site icon vidhaatha

ద్విచక్ర వాహనదారులకు హోండా దీపావళి ఆఫర్‌..! బైక్‌, స్కూటర్స్‌ కొనుగోళ్లపై రూ.5వేల క్యాష్‌బ్యాక్‌..!

Honda Offers | ప్రముఖ దిగ్గజ ఆటో మొబైల్‌ కంపెనీ హీరో హోండా దీపావళి సందర్భంగా ద్విచక్ర వాహనాలపై స్పెషల్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో రూ.5వేల వరకు క్యాష్‌బ్యాక్‌తో పాటు జీరో డౌన్‌పేమెంట్‌, నోకాస్ట్‌ ఈఎంఐ తదితర ఆఫర్లు ఇస్తున్నది. హోండా బైకులు, స్కూటర్స్‌ కొనుగోలు చేసే వినియోగదారులకు 6.99 శాతం వడ్డీకే లోన్స్‌ ఇస్తున్నట్లు పేర్కొంది. షైన్‌ బైక్‌పై 100 pe 100 స్కీమ్‌ ఆఫర్‌ చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆఫర్లు పరిమితకాలం మాత్రమే అందుబాటులో ఉంటాయని, అయితే పలు షరతులు సైతం వర్తిస్తాయని హోండా మోటార్స్‌ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. జపనీస్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చర్‌ కంపెనీ భారత మార్కెట్‌లోకి ఇటీవల సీబీ300ఆర్‌ మోడల్‌ బైక్‌ను తీసుకువచ్చింది.

ఈ బైక్స్‌ ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ.2.40లక్షలు. బజాజ్ డామినార్ 400, టీవీఎస్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ 310, కేటీఎం 390 డ్యూక్, బీఎండబ్ల్యూ జీ310 ఆర్‌ మోడల్‌ బైక్‌లకు గట్టి పోటీనిస్తున్నది. 9వేల ఆర్పీఎం వద్ద 29.98 బీహెచ్‌పీ హై పవర్‌ను.. 7,500 ఆర్పీఎం వద్ద 27.5 ఎన్‌ఎం హై టార్క్‌ను విడుదల చేస్తుంది. బైక్‌లో స్లిప్‌ అండ్‌ అసిస్ట్‌ క్లచ్‌తో సిక్స్‌ స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ బైక్‌తో పాటు హోండా మార్కెట్‌లో మరో లిమిటెడ్‌ ఎడిషన్‌ యాక్టివాను తీసుకువచ్చింది. స్టాండర్డ్ వేరియంట్‌కు రూ.80,734 ఉండగా.. స్మార్ట్ వేరియంట్‌ ధరను రూ.82,734గా నిర్ణయించింది. ఇవి కేవలం ఎక్స్‌ షోరూం ధరలు మాత్రమే. అయితే, లిమిటెడ్‌ ఎడిషన్‌లో కంపెనీలు మార్పులు చేయలేదు. స్వల్పంగా కాస్మెటిక్‌ మార్పులు చేయగా.. లిమిటెడ్‌ ఎడిషన్‌ పెర్ల్ సైరన్ బ్లూ, మ్యాట్ స్టీల్ బ్లాక్ మెటాలిక్ రంగుల్లో లభిస్తుంది.

Exit mobile version