gold prices drop| తగ్గిన బంగారం..స్థిరంగా వెండి ధరలు

అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భారీ మార్పులకు లోనవుతున్నాయి. గురువారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 980 తగ్గి రూ.1,63,530వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ. 2,95,000వద్ద కొనసాగుతుంది.

విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్దం..అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భారీ మార్పులకు లోనవుతున్నాయి. గురువారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 980 తగ్గి రూ.1,63,530వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 900తగ్గి రూ.1,49,900వద్ది నిలిచింది. కిలో వెండి ధర రూ. 2,95,000వద్ద కొనసాగుతుంది.

అంతర్జాతీయ పరిణామాలు..ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడులైన విలువైన లోహాలపై పెట్టుబడులను మళ్లిస్తున్నారు. అలాగే డాలర్ విలువ కొంత పుంజుకోవడంతో బంగారం ధరలు కాస్త తగ్గు ముఖం పట్టాయి. ప్రస్తుత పరిస్థితుల్లో స్వల్ప కాలంలో మనుముందు బంగారం ధరలు తగ్గుముఖం పట్టవచ్చని మార్కెట్ నిపుణులు చెబతున్నారు. అయితే భవిష్యత్తులో మాత్రం భారీ పెరుగుదలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు.

Latest News